News
News
వీడియోలు ఆటలు
X

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీకి మే 'పరీక్షా'కాలం, పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణ! మే నెలలో 7 పరీక్షలు!

మే నెలలో వివిధ నియామక పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తులు ప్రారంభించింది. మే 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు నియామక పరీక్షలన్నీ వాయిదాపడ్డాయి. అప్పటికే నిర్వహించిన పరీక్షలతోపాటు, భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలను కూడా కమిషన్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మే నెలలో వివిధ నియామక పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తులు ప్రారంభించింది. మే 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలో 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా 7 పరీక్షలు నిర్వహించనుంది. వీటిలో అత్యధికంగా 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనుంది. 

తెలంగాణలో 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 7 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు కూడా పూర్తిచేసింది. అయితే, మార్చి నెలలో టీఎస్‌పీఎస్సీలో కంప్యూటర్‌ హ్యాకింగ్‌, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. వాయిదాపడిన పరీక్షల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీతోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలు ఉన్నాయి. వీటన్నింటికీ మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రతి పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మే నెలలో నిర్వహించబోయే కొన్ని పరీక్షలకు ప్రశ్నలు ముందుగానే రూపొందించారు. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కమిషన్‌ అవన్నీ పక్కన పెట్టెయ్యాలని నిర్ణయించింది. ఇకనుంచి జరుగబోయే ప్రతి పరీక్షకు కొత్తగా మళ్లీ ప్రశ్నలు సిద్ధం చేస్తున్నది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్‌ నిపుణులను సైతం మార్చేసింది. ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటి విషయాల్లో గోప్యత పాటిస్తున్నారు.

మే నెలలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు...

➥ టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పరీక్ష:  08.05.2023, 09.05.2023.

➥ టీఎస్‌పీఎస్సీ లెక్చరర్స్- గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు: 13.05.2023.

➥ టీఎస్‌పీఎస్సీ టెక్నికల్ అసిస్టెంట్ పరీక్ష: 15, 16-05.2023.

➥ టీఎస్‌పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష: 16.05.2023.

➥ టీఎస్‌పీఎస్సీ ఫిజికల్ డైరెక్టర్-(ఇంటర్ బోర్డు) పరీక్ష: 17.05.2023.

➥ టీఎస్‌పీఎస్సీ లైబ్రేరియన్ పరీక్ష: 17.05.2023.

➥ టీఎస్‌పీఎస్సీ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష: 19.05.2023.

➥ టీఎస్‌పీఎస్సీ ఏఈఈ (సివిల్ ఇంజినీర్): 21.05.2023.

నార్మలైజేషన్‌ విధానంలో మార్కులు..
టీఎస్‌పీఎస్సీ ఇకపై పరీక్షలన్నీ సీబీఆర్‌టీ(కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) విధానంలోనే నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 50 వేల అభ్యర్థుల వరకే ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించే వెసులుబాటు ఉన్నది. 50 వేలకంటే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే షిఫ్టుల వారీగా పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. అయితే, ఒక షిఫ్టులో సులభమైన ప్రశ్నలు, మరో షిఫ్టులో కఠినమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. అందుకే, ఆన్‌లైన్‌ పరీక్షల్లో మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్‌ పద్ధతి పాటించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. నార్మలైజేషన్‌ విధానంలో ఐదు డెసిమల్స్‌ వరకు మారులను పరిగణనలోకి తీసుకొంటారు. నార్మలైజేషన్‌లో వచ్చిన మా రులు పరీక్షలో వచ్చిన మారులకు వ్య త్యా సం ఉంటుంది. ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్‌ డీవియేషన్‌ పద్ధతి లో తీసుకొని లెక్కిస్తారు. నార్మలైజేషన్‌ ఫార్ములాను ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ, ప్రవేశ పరీక్షల్లో అమలు చేస్తున్నారు.

ఐఏఎస్‌ అధికారి సంతోష్‌కి పరీక్షల నిర్వహణ బాధ్యతలు..
టీఎస్‌పీఎస్సీలో జరిగే పరీక్షలను సిబ్బందే పర్యవేక్షించేవారు. కమిషన్‌లో ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలనేది చైర్మన్‌, సెక్రటరీలు నిర్ణయించేవారు. ప్రశ్నపత్రాల పంపిణీ నుంచి పరీక్ష ముగిసే వరకు సిబ్బందే బాధ్యత వహించేవారు. అయితే, కమిషన్‌ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా పరీక్షల విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల విభాగం కో ఆర్డినేషన్‌ బాధ్యతను ఐఏఎస్‌ అధికారి సంతోష్‌కి అప్పగించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని పరీక్ష ముగిసే వరకు పరీక్షల విభాగం పర్యవేక్షిస్తుంది. మే నెల నుంచి జరిగే పరీక్షలన్నీ ఈ విభాగమే కో ఆర్డినేట్‌ చేస్తున్నది.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏపీ నిట్‌ తాడేపల్లిగూడెం ప్రాంగణంలో పీహెచ్‌డీ, ఎంఎస్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకడమిక్‌ డీన్‌ టి.కురుమయ్య మే 1న‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మే 29లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. సంస్థలో 12 విభాగాలకు సంబంధించి మొత్తం 57 పీహెచ్‌డీ సీట్లు ఉన్నాయన్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 02 May 2023 02:34 PM (IST) Tags: TSPSC Exams TSPSC Recruitment Exams TSPSC Online Exams TSPSC CBRT 2023

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్