TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలపై వీడని చిక్కుముడి! ఎన్ని లీకయ్యాయి? ఎంతమందికి చేరాయి?
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసుులో సిట్ విచారణ ప్రారంభమై నెల దాటినా ఇంకా పూర్తిస్థాయి వివరాలు బయటపడలేదు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసుులో సిట్ విచారణ ప్రారంభమై నెల దాటినా ఇంకా పూర్తిస్థాయి వివరాలు బయటపడలేదు. నెల రోజుల తర్వాత గాని డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) ప్రశ్నపత్రం లీకేజీ నిందితులు పట్టుబడలేదు. ప్రశ్నపత్రాలు ఎన్ని లీకయ్యాయి, ఎంతమంది లబ్ధి పొందారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. కమిషన్ మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో నాలుగింటిని రద్దు చేసింది. వీటిలో మూడు పరీక్షలకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాబోయే రోజుల్లో దర్యాప్తులో బయటపడే అంశాల ఆధారంగా మిగతా పరీక్షల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
దర్యాప్తులో మొదట ఏఈ ప్రశ్నపత్రం, ఆ తర్వాత గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకైనట్లు తేలింది. వీటిని ప్రవీణ్, రాజశేఖర్ ముఠా లీక్ చేసినట్లు నిర్ధారణ అయినప్పటికీ.. ఆధారాల సేకరణ సిట్‌కు సవాలుగా మారింది. డీఏవో పరీక్ష ప్రశ్నపత్రం ఎవరికి అమ్మారన్న విషయం దాదాపు నెల రోజుల తర్వాత వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం. అయితే మొత్తం ఎన్ని ప్రశ్నపత్రాలు లీకయ్యాయి? ఎంతమంది చేతికి చిక్కాయన్నది? మాత్రం మిస్టరీగా మారింది. గ్రూప్-1, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీడీపీవో, సూపర్ వైజర్ గ్రేడ్-1, డీఏవో, ఏఈఈ, ఏఈ పరీక్షలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. దర్యాప్తు మొదలైనప్పుడు వీటిలో గ్రూప్-1, ఏఈ, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలను రద్దు చేసింది. సీడీపీవో, సూపర్ వైజర్ గ్రేడ్-1, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పరీక్షలు రద్దు కాలేదు.
కమిషన్‌లోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌కు చెందిన కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడ్డ నిందితుడు రాజశేఖర్ అందుబాటులో ఉన్న ప్రశ్నపత్రాలను తస్కరించాడు. అతడికి చిక్కాయని భావిస్తున్న నాలుగు పరీక్షలను ముందుగానే రద్దు చేశారు. గ్రూప్-1, ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ ఇప్పటివరకూ 14 మందిని అరెస్టు చేసింది. డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి తాజాగా ఇద్దరిని అరెస్టు చేయడంతో ఈ సంఖ్య 16కు చేరింది. సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు న్యాయస్థానం అనుమతితో ప్రవీణ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ప్రశ్నపత్రాలను ఎవరెవరికి ఇచ్చాడన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అతడు నోరు మెదపలేదని తెలిసింది. తొలుత ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే అమ్మానని చెప్పాడు. పోలీసులు జరిపిన సాంకేతిక దర్యాప్తులో ఖమ్మానికి చెందిన సాయి లౌకిక్‌కు డీఏవో ప్రశ్నపత్రాన్ని రూ.6 లక్షలకు అమ్మినట్లు తేలింది. దీంతో లౌకిక్‌తో పాటు అతడి భార్య సుష్మితను కూడా అరెస్టు చేశారు.
Also Read:
ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ తుది పరీక్షలు, త్వరలోనే ప్రిలిమినరీ కీ విడుదల!
ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన తుది రాత పరీక్షలు నేటితో ముగిశాయి. ఈ పరీక్షలకు 96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని మొత్తం 81 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. శనివారం రెండు పేర్లు, ఆదివారం రెండు పేపర్ల చొప్పున తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. శనివారం జరిగిన పరీక్షలకు 81 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. 62,342 మంది అభ్యర్థులకు గాను 59,534 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం 79 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 60,772 మంది అభ్యర్థులకు గాను 58,019 మంది పరీక్షలు రాశారు. ఈ పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ట్రాన్స్‌కోలో 92 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు!
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆన్‌లైన్ ద్వావరా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..