News
News
వీడియోలు ఆటలు
X

SI Exams : ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ తుది పరీక్షలు, త్వరలోనే ప్రిలిమినరీ కీ విడుదల!

SI Exams : ఎస్ఐ తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 21 కేంద్రాలు ఎస్ఐ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని సీపీ రంగనాథ్ తెలిపారు.

FOLLOW US: 
Share:

SI Exams: ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన తుది రాత పరీక్షలు  నేటితో ముగిశాయి. ఈ పరీక్షలకు 96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లోని మొత్తం 81 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. శనివారం రెండు పేర్లు, ఆదివారం రెండు పేపర్ల చొప్పున తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. శనివారం జరిగిన పరీక్షలకు 81 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. 62,342 మంది అభ్యర్థులకు గాను 59,534 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం 79 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 60,772 మంది అభ్యర్థులకు గాను 58,019 మంది పరీక్షలు రాశారు. ఈ పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.  

వరంగల్‌లో.. 
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు జరిగిన ట్రైనీ పోలీస్ సబ్-ఇన్స్స్పెక్టర్ల ఉద్యోగ నియామక రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్.ఐ (సివిల్/ఎఆర్/టీఎస్ఎస్సీ/ ఎస్పీఎఫ్/ఎస్ఏఆర్/సిపియల్/ఫైర్ విభాగాల్లో సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా నిన్న, ఇవాళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 21 పరీక్షా కేంద్రాల్లో తుది రాత పరీక్షలను నిర్వహించారు. రెండో రోజనైన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన మూడో పేపర్ పరీక్షకు 14076 మంది అభ్యర్థులకు గాను 13456 మంది అభ్యర్థులు హాజరు కాగా 620 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు. అలాగే మధ్యాన్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించిన నాల్గో పేపర్ పరీక్షకు 13412 మంది అభ్యర్థులు హాజరుకాగా 664 మంది అభ్యర్థులు గైర్హజరు అయ్యారు. 

ప్రధాన కూడళ్లల్లో హెల్ప్ డెస్క్‌లు..
ఆదివారం ఉదయం 8 గంటలకు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థునులను పోలీస్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అభ్యర్థులను పరీక్షా కేంద్రాంలోనికి అనుమతించారు. ఇందుకోసం ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయగా, ఐదుగురు ఇన్స్పెక్టర్లు రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహించారు. డివిజన్ స్థాయిలో ఏసీపీలు, డీసీపీ స్థాయి పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎండలను దృష్టిలో ఉంచుకోని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది ఏర్పాటుతో పాటు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సిటీ పరిధిలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లల్లో పోలీస్ సిబ్బందిచే హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుచేశామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

ప్రశాంతంగా పరీక్షలు..
రెండు రోజుల పాటు కొనసాగిన ఎస్.ఐ ఉద్యోగ తుది పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించడంలో విధులు నిర్వహించిన డీసీపీలు మురళీధర్, కరుణాకర్, అబ్దుల్ బారీ, సీతారాం అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అంకిత్ కుమార్, రీజినల్ కోర్డినేటర్ ఆనంద్ కిషోర్ కోలాతో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐ ఇతర పోలీస్ సిబ్బంది, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందనలు తెలియజేశారు.

Published at : 10 Apr 2023 05:52 AM (IST) Tags: Exams TSLPRB SI jobs SI Final Exam preliminary key

సంబంధిత కథనాలు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

BRS News: బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా

BRS News: బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

టాప్ స్టోరీస్

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!