TS Transco Jobs: తెలంగాణ ట్రాన్స్‌కోలో 92 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు!
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆన్‌లైన్ ద్వావరా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ కొనసాగనుంది.
వివరాలు..
➥ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 92 ఖాళీలు
అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
విభాగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ (ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, సివిల్, ఐటీ), డిప్లొమా(డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్‌ఈ).
అర్హతలు: 2020/ 2021/ 2022 సంవత్సరంలో సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: డిగ్రీ/ డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.8000 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 11.04.2023.
➥ ట్రాన్స్‌కో దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2023.
Also Read:
ఇండోర్ ఐఐటీలో 34 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- అర్హతలివే!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ (ఐఐటీ ఇండోర్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..