News
News
వీడియోలు ఆటలు
X

IITI: ఇండోర్ ఐఐటీలో 34 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- అర్హతలివే!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ (ఐఐటీ ఇండోర్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ (ఐఐటీ ఇండోర్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం కలగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 34 పోస్టులు

* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 1 & 2)

విభాగాలు..

1. ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌, స్పెస్‌ ఇంజినీరింగ్

2. బయోసైన్సెస్, బయోమెడికల్ ఇంజినీరింగ్

3. సివిల్ ఇంజినీరింగ్

4. కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్

5. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్

6. మెకానికల్ ఇంజినీరింగ్

7. మెటలర్జీ ఇంజినీరింగ్ అండ్‌ మెటీరియల్స్ సైన్స్

8. కెమిస్ట్రీ

9. మ్యాథ్స్‌

10. ఫిజిక్స్‌

11. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్

అర్హతలు: ఫస్ట్ క్లాస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి. 

ఎంపిక విధానం: నింబంధనల మేరకు ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.1,01,500 - రూ.1,68,276; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.1,01,500 - రూ.1,68,276.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  21.04.2023.

Notification 

Online Application 

Website 

Also Read:

ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 08 Apr 2023 07:39 AM (IST) Tags: Indian Institute of Technology Indore IIT Indore Recruitment IIT Indore Notification Faculty Recruitment Assistant Professor Grade I & I

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?