(Source: ECI/ABP News/ABP Majha)
TSPSC HWO Halltickets: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TGPSC: తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీల భర్తీకి జూన్ 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ జూన్ 21న విడుదల చేసింది.
TSPSC HWO Recuitment: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి నిర్వహించినున్న పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ జూన్ 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
Instructions - Do's and Don'ts - TGPSC CBRT (అభ్యర్థులకు సూచనలు)
Procedure for Candidates to enter Examination Labs
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 24.06.2024 - 28.06.2024: మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్డడీస్), రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (ఎడ్యుకేషన్) పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ 24.06.2024: మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్డడీస్), రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యకేషన్) పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో ఉంటాయి.
తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) 581 ఖాళీల భర్తీకి 2022, డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గతేడాది పేపర్ లీక్, తదితర కారణాల వల్ల పరీక్ష నిర్వహించలేకపోయారు. తాజాగా కమిషన్ పరీక్ష తేదీలను ఖరారుచేసింది.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 581
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ -1): 05 పోస్టులు
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు: 70
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్): 228
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (): 140
➥ వార్డెన్ (గ్రేడ్ -1): 05
➥ మ్యాట్రన్ (గ్రేడ్ -1): 03
➥ వార్డెన్ (గ్రేడ్-2): 03
➥ మ్యాట్రన్ (గ్రేడ్-2): 02
➥ లేడి సూపరింటెండెంట్: 19
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
జీతభత్యాలు..
➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు.
➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-2) పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.
➨ వార్డెన్, మ్యాట్రన్ (గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు.
➨ వార్డెన్, మ్యాట్రన్(గ్రేడ్-2), లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.