అన్వేషించండి

Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే

TGPSC Group 2 Exams | తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులు ఈ నియమాలు పాటించాలి.

TSPSC Group 2 Exams | హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 పోస్టుల భర్తీకి  గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం, సోమవారం నాడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు రోజుకు రెండు పేపర్ల చొప్పున నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

డిసెంబర్ 9న హాల్ టికెట్లు విడుదల

783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాగా, మొత్తం 5,51, 847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9న టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58 రిజీయన్ కేంద్రాల్లో 1368 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 2 పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం, సోమవారాల్లో 2 రోజుల పాటు, రోజుకు 2 పేపర్ల చొప్పున మొత్తం 4 పేపర్లలో ఎగ్జామ్ జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 మల్టిపుల్ ఛాయిలస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 పేపర్లలో కలిపి 600 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 600 మార్కులు. 

ఆది, సోమవారాల్లో డిసెంబర్ 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్ లలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల వరకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు పేపర్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకే ఎగ్జామ్ సెంటర్ లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. సోమవారం సైతం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్ ఇదే సమయాలలో జరగనున్నాయి. 

అభ్యర్థులు ఈ విషయాలు పాటించాలి.
- అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌లోకి ఉదయం ఉదయం 8.30 నుంచి 9.30 లోపే చేరుకోవాలి. ఉదయం వేళ 9.30 తరువాత ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు.
- మధ్యాహ్నం వేళ 1.30 నుంచి 2.30 వరకు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2.30 కు గేట్స్ క్లోజ్ చేస్తారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 
ప్రతి పేపర్ పరీక్ష ప్రారం భానికి అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తారు. ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 కి గేట్లు మూసివేత
- హాల్ టికెట్ తో పాటు అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడెంటింటి కార్డు తీసుకుని వెళ్లాలి.
- మీ హాల్ టికెట్‌కు లేటెస్ట్ ఫొటో ఒకటి అతికించాలి. కనీసం మీ వెంట ఫొటో తీసుకెళ్తే ఎగ్జామ్ సెంటర్ వద్దనైనా అతికించక తప్పదు.
- అభ్యర్థులు బ్లూ లేదా ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలి. వైట్‌నర్, మార్కర్ లాంటి వాటికి అనుమతి లేదు. పేపర్లు, అదనపు స్టేషనరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. 
- షూస్‌ ధరించిన వారిని ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరని గమనించాలి. 
- మహిళా అభ్యర్థులను మంగళ సూత్రం, గాజులు మాత్రమే అనుమతి ఉంది. మరే ఇతర ఆభరణాలతో వచ్చినా వారిని సైతం ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు.
- ఓఎంఆర్ షీట్ పైన ఎలాంటి సింబల్స్, గుర్తులు రాయకూడదు. కేవలం అందులో సూచించిన విషయాలకు మాత్రమే సమాధానం రాయాలి. డిక్లరేషన్ ఇవ్వాలి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ గానీ, ఎగ్జామ్ పేపర్ షీట్ నెంబర్, ఎగ్జామ్ పేపర్ నెంబర్ గానీ రాంగ్ బబులింగ్ చేసినా, తప్పుగా రాసినా వేరే ఓఎంఆర్ మాత్రం ఇవ్వడం కుదరదని గమనించి జాగ్రత్తగా పరీక్ష రాయాలి.

Also Read: NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget