By: ABP Desam | Updated at : 21 Mar 2023 04:14 PM (IST)
Edited By: omeprakash
ఎస్సీటీ ఎస్‌ఐ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26న ఎస్‌సీటీ ఎస్‌ఐ టెక్నికల్ పేపర్ రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 21న విడుదల చేసింది. అభ్యర్థలు తమ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఒకవేళ హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఏర్పడితే support@tslprb.inకు ఈ మెయిల్ చేయడం ద్వారా లేదా 93937 11110, 93910 05006 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. అయితే ఎస్సీటీ ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే మిగతా రెండు పేపర్లకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీచేయనున్నట్లు పోలీసు నియామక బోర్డు తెలిపింది. ఆ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన తేదీలను మరో ప్రకటన ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించింది.
ఇదిలావుంటే అభ్యర్థులు హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోగానే తప్పనిసరిగా దానిపై సంబంధిత ప్రదేశంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అంటించాలని బోర్డు సూచించింది. హాల్‌టికెట్‌పై పాస్ ఫొటో లేకపోతే పరీక్ష హాల్‌లోకి అనుమతించరని స్పష్టం చేసింది.
మెయిన్ పరీక్షల తేదీలివే..
➥ మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (PTO) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.
➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు.
Also Read:
సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) స్టెనో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సీఆర్‌పీఎఫ్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు వెబ్‌సైట్‌లోని లాగిన్ పేజీలో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏఎస్ఐ స్టెనో ఉద్యోగాల భర్తీకి మార్చి 27న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!
C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్