News
News
X

కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ - డ్రైవింగ్, ట్రేడ్‌ టెస్ట్‌ షెడ్యూలు వచ్చేసింది! ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సంతకం చేసిన దేహదారుఢ్య పరీక్ష ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, వాటి ప్రతులను తీసుకురావాలని నియామక బోర్డు వెల్లడించింది.

FOLLOW US: 
Share:

మార్చి 2 నుంచి పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్, మెకానిక్ అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLRPB) తెలిపింది. వీరితో పాటు విపత్తు నిర్వహణ, ఫైర్ విభాగంలో డ్రైవర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది. ప్రాథమిక పరీక్ష పూర్తయి దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

హైదరాబాద్ అంబర్‌పేటలోని సీపీఎల్ మైదానంలో వీరికి మార్చి 2 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తామని నియామక మండలి వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 25న ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే support@tslrpb.in కు గానీ 9393711110 లేదా 9391005006 నంబరుకు గానీ సమాచారం ఇవ్వాలని తెలిపింది.

అడ్మిట్ కార్డు రెండు భాగాలుగా ఉంటుంది. పై భాగంలో అభ్యర్థి వివరాలు, పరీక్ష సమయం, వేదిక, సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఉంటాయి. దీనిని నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపర్చాల్సి ఉంటుంది. కింది భాగాన్ని చెకప్ స్లిప్‌గా సంబంధిత అధికారి పరీక్షా కేంద్రంలో రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకుంటారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సంతకం చేసిన దేహదారుఢ్య పరీక్ష ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, వాటి ప్రతులను తీసుకురావాలని నియామక బోర్డు వెల్లడించింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ అనంతరం ఆర్‌ఎఫ్‌డీ బ్యాండ్‌ను చేతికి ఇస్తామని వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Also Read:

పోలీసు అభ్యర్థులకు అలర్ట్, తుది పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే!
పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇతర పరీక్షలు ఉండటంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విన్నపంతో పోలీసు నియామక మండలి మార్పులు చేసింది. దీంతో ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30కి వాయిదా పడింది. కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షను కూడా ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30కి మార్చారు. అదే విధంగా మార్చి 12న జరగాల్సిన ఎ‌స్‌ఐ(ఐటీ) పరీక్షను మార్చి 11కి మార్చారు. ఇక ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్) పరీక్షను కూడా మార్చి 12 నుంచి 11కి మార్చారు.  
మెయిన్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

DAO HallTickets: డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ వ‌ర్క్స్ అకౌంట్స్ స‌ర్వీస్‌లో డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 23 Feb 2023 06:49 PM (IST) Tags: TS Police Recruitment Driving Tests Mechanic Trade Test f SCT Police Constable Driver Posts SCT Police Constable Mechanic Trade Test

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో  మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

TSPSC Updates : టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

TSPSC Updates :  టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి