TSTET Halltickets: టీఎస్ టెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్! డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి సెప్టెంబరు 15న 'టెట్' పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష హాల్‌టికెట్లను సెప్టెంబరు 9 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి సెప్టెంబరు 15న 'టెట్' పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబరు 9 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-1 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష షెడ్యూలు..
పేపర్-1 పరీక్ష విధానం:
పేపర్-1లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్ నుంచి 30 పశ్నలు ఉంటాయి. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-5 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).
పేపర్-2 పరీక్ష విధానం:
పేపర్-2లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. మూడు సెక్షన్ల నుంచి 30 పశ్నల చొప్పున 90 ప్రశ్నలు, ఒక సెక్షన్ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).
అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40% గా నిర్ణయించారు.
తెలంగాణ టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
5,089 పోస్టులతో 'డీఎస్సీ' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ సెప్టెంబరు 7న విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. సెప్టెంబరు 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
డీఎస్సీ నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెప్టెంబరు 12 నుంచి జేఎల్ రాతపరీక్షలు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 12 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్ 3 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను ఇప్పటికే విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..