News
News
X

TSPRB Physical Test: ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల ముహూర్తం ఖరారు, ఈవెంట్లు ఎప్పుడంటే?

ఫిజికల్ ఈవెంట్లు ప్రారంభించిన 25 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లోని మైదానాల్లో సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు.

FOLLOW US: 
 

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్లకు తెలంగాణ పోలీసు నియామక మండలి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. డిసెంబరు మొదటి వారంలో ఈవెంట్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేసింది. వాటిలో అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఫిజికల్ ఈవెంట్లు మొదలైన నాటి నుంచి 25 రోజుల్లో ప్రక్రియను ముగించాలని అధికారులు భావిస్తున్నారు. శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మైదానంలో సగటున 130 మంది సిబ్బంది ఈవెంట్లను పర్యవేక్షించనున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయితే నవంబరు చివరివారం నుంచే ఫిజికల్ ఈవెంట్లు ప్రారంభమయ్యే అవకాశమూ లేకపోలేదు.

పోస్టులెన్నయినా పరీక్షలు ఒకేసారి...
గతంలో ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీ పడితే ఆన్నిసార్లు ఫిజికల్ ఈవెంట్లు వేర్వేరుగా నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఎన్ని పోస్టులకు పోటీపడినా ఒకసారి అర్హత సాధిస్తే సరిపోయేలా కీలక మార్పులు చేశారు. ఒకసారి అర్హత సాధించగలిగితే ఆ ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు మండలి ప్రకటించింది.

12 మైదానాల్లో ఈవెంట్లు...
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మరో ఒకటి రెండు కొత్త ప్రదేశాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 

News Reels

🔰 హైదరాబాద్- ఎస్ఏఆర్‌సీపీఎల్ - అంబర్‌పేట

🔰 సైబరాబాద్- 8వ బెటాలియన్ కొండాపూర్

🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం

🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం

🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం

🔰 కరీంనగర్- సిటీపోలీస్ శిక్షణ కేంద్రం

🔰 ఆదిలాబాద్- పోలీస్ పరేడ్‌ గ్రౌండ్

🔰 నిజామాబాద్ రాజారాం స్టేడియం, నాగారం(నిజామాబాద్)

🔰 మహబూబ్‌నగర్- డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్

🔰 వరంగల్- హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం

🔰 ఖమ్మం- పోలీస్ పరేడ్ గ్రౌండ్

🔰 నల్గొండ- మేకల అభినవ్ స్టేడియం

ఈవెంట్లు ఇలా..
🔰 ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది.

🔰పరుగుపందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు.

🔰 వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.

🔰 ఫిట్‌నెస్ టెస్ట్‌లో ప్రతి అభ్యర్థి ఛాతీ, ఎత్తు, బరువును నమోదుచేస్తారు. 

త్వరలో అడ్మిట్ కార్డు...
ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డు ఉంటేనే ఫిజికల్ ఈవెంట్లకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈవెంట్లకు హాజరయ్యే వారు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్య సూచనలు...

✦ అభ్యర్థి సంతకంతో కూడిన పార్ట్-2 ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు ఫిజికల్ ఈవెంట్ అడ్మిట్ కార్డు వెంట తీసుకురావాలి.

✦ స్వయంగా ధ్రువీకరించకున్న, కమ్యూనిటీ సర్టిఫికెట్ కాపీలను కచ్చితంగా వెంటతీసుకురావాలి.

✦ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కాపీ తీసుకురావాల్సి ఉంటుంది.

✦ ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి.

✦ అభ్యర్థులు తమకు కేటాయించిన గ్రౌండ్‌లో ఉదయం 4 నుంచి 5 గంటల లోపు ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఆలస్యమైన వారికి అనుమతి ఉండదు.

✦ అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి.

రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం ఇలా..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో మొత్తం 41.67 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.


Also Read:

 ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్లపై బోర్డు కీలక అప్‌డేట్! వీటిని సిద్ధం చేసుకోండి!

 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో 41.67 శాతం ఉత్తీర్ణులు, ఆన్సర్ కీ కూడా వచ్చేసింది! 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 18 Nov 2022 07:56 PM (IST) Tags: TSLPRB TSLPRB SI Physical Events TSLPRB Constable Physical Events TS Police PET Hall Tickets TS SI PMT TS Constable PET PMT TS Police Physical Events

సంబంధిత కథనాలు

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

DME Recruitment: ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!

DME Recruitment: ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!

TSLPRB Police Physical Events: పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు! వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

TSLPRB Police Physical Events:  పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు!   వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

SECL Recruitment 2022: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు, వివరాలు ఇలా!

SECL Recruitment 2022: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు, వివరాలు ఇలా!

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

RRR| SS Rajamouli wins Best Director|New York Film Critics Circleలో ఉత్తమ దర్శకుడు రాజమౌళి | | ABP

RRR| SS Rajamouli wins Best Director|New York Film Critics Circleలో ఉత్తమ దర్శకుడు రాజమౌళి | | ABP