TS Group I Prelims Exam : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
TS Group I Prelims Exam : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు అయింది. మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన టీఎస్పీఎస్సీ ప్రాథమిక పరీక్ష తేదీని ఖరారు చేసింది.
TS Group I Prelims Exam : తెలంగాణ గ్రూప్ –1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారుపై మంగళవారం టీఎస్పీఎస్సీ సుదీర్ఘంగా చర్చించింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారు చేసింది. అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు నిర్ణయించింది. మెయిన్స్ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ. అక్టోబరు 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్-1 పరీక్ష కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణంగా గ్రూప్ -1 పరీక్షలు కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జూన్ 4 నాటికి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒక్కోపోస్టుకు సరాసరి 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
మొత్తం 503 పోస్టులు
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇందులో 225 మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ పోస్టులకు 1,51,192 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. దివ్యాంగుల కేటగిరీలో 24 పోస్టులకు 6,105 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీపడనున్నారు. ఈసారి గ్రూప్ -1 పోస్టులుకు 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్ -1 పోస్టులు శాఖలవారీగా వివరాలు
- జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు - 5
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 40
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పోస్టులు - 20
- డీఎస్పీ పోస్టులు - 91
- జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు - 2
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టులు - 8
- జిల్లా ఉపాధి అధికారి పోస్టులు - 2
- జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు - 6
- గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు - 35
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులు - 121
- జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు - 5
- సీటీఓ పోస్టులు - 48
- డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు - 42
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు - 26
- ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు - 4
- జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు - 2