News
News
వీడియోలు ఆటలు
X

UPSC Recruitment: సీఏపీఎఫ్‌లో 322 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, మే 16తో దరఖాస్తుకు ఆఖరు!

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023 దరఖాస్తు గడువు మే 16తో ముగియనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 6న రాతపరీక్ష నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ త‌దిత‌ర ద‌ళాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి "సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023" నోటిఫికేష‌న్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 26న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 322 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 26న ప్రారంభంకాగా.. మే 16తో దరఖాస్తు గడువు ముగియనుంది.

డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 6న రాతపరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తొలి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

రాతపరీక్ష విధానం..
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 

➥ పేపర్-1: జనరల్ ఎబిలిటీ & ఇంటెలిజెన్స్‌‌కు 250 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టిపుల్ ఛాయిస్) ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. 

➥ పేపర్-2: జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌కు 200 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో వ్యాసం రాయాల్సి ఉంటుంది. అయితే ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇతర కమ్యూనికేషన్స్/లాంగ్వేజ్ స్కిల్ మాత్రం ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.

ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➥ అభ్యర్థులు 100 మీటర్లు పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పరుగు పూర్తిచేయాలి.

➥ అదేవిధంగా 800 మీటర్ల పరుగుపందెం కూడా నిర్వహిస్తారు. పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది.

➥ లాంగ్ జంప్‌లో మూడు అవకాశాలలో పురుషులు 3.5 మీటర్లు, మహిళలు 3.0 మీటర్లు జంపింగ్ చేయాల్సి ఉంటుంది. 

➥ ఇక పురుషులకు మాత్రమే షార్ట్‌పుట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు అవకాశాల్లో 7.26 కిలోల బరువుండే గుండును విసరాల్సి ఉంటుంది.

Notification

Online Application

Also Read:

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 103 నర్స్‌, పారామెడికల్‌ పోస్టులు- అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ) నర్స్‌, పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ, హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 15 May 2023 09:02 PM (IST) Tags: Government Jobs UPSC CAPF ACs Notification UPSC CAPF ACs Recruitment UPSC CAPF ACs 2023 Application UPSC CAPF Assistant Commandants 2023

సంబంధిత కథనాలు

AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!

AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!

ALIMCO Recruitment: అలిమ్‌కోలో103 ఉద్యోగాలు, అర్హతలివే! ఎంపికైతే రూ.90,000 వరకు జీతం!

ALIMCO Recruitment: అలిమ్‌కోలో103 ఉద్యోగాలు, అర్హతలివే! ఎంపికైతే రూ.90,000 వరకు జీతం!

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!