NLC: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 103 నర్స్, పారామెడికల్ పోస్టులు- అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ) నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ) నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ, హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 103.
* నర్స్, పారామెడికల్ పోస్టులు
1. మేల్ నర్సింగ్ అసిస్టెంట్: 36
2. ఫీమేల్ నర్సింగ్ అసిస్టెంట్: 22
3. మెటర్నిటీ అసిస్టెంట్: 05
4. పంచకర్మ(ఆయుర్వేదం) అసిస్టెంట్: 04
5. రేడియోగ్రాఫర్: 03
6. ల్యాబ్ టెక్నీషియన్: 04
7. డయాలసిస్ టెక్నీషియన్: 02
8. ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్: 05
9. ఫిజియోథెరపిస్ట్: 02
10. నర్సులు: 20
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ, హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 55 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.486. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.236.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 01 మార్కు ఉంటుంది. నెగటివ్ మార్కులు లేవు. రాత పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇంగ్లీష్‌లో ఉంటుంది.
జీతం: పోస్టుని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.36,000 వరకు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2023.
దరఖాస్తుకు చివరి తేది: 01.06.2023.
Notification
Also Read:
టీఎస్‌పీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! షెడ్యూలు ప్రకారమే పరీక్ష!
తెలంగాణ ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం, మే 17న లైబ్రేరియన్ పోస్టుల రాతపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి, అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్ టెస్టు లింకు అందుబాటులో ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.. కాబట్టి, అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్ టెస్టు లింకు అందుబాటులో ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..