News
News
వీడియోలు ఆటలు
X

TSPSC AO Exam: వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.. కాబట్టి, అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు లింకు అందుబాటులో ఉంది.

తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 10 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 16న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు..

* అగ్రికల్చర్ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 148 (మల్టీజోన్-1: 100, మల్టీజోన్-2: 48)

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (అగ్రికల్చర్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

జీతం: రూ.51,320– రూ.1,27,310.

Also Read:

'గ్రూప్-4' అభ్యర్థుల‌కు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం- తేదీలివే!
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్ -4 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-4 రాత ప‌రీక్షను జులై 1న నిర్వహించ‌నున్నారు. అయితే ప‌లువురు అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పులు చేశారు. దీంతో అభ్యర్థుల వినతుల మేర‌కు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పులు స‌రిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది. మే 9 నుంచి 15 వ‌ర‌కు అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పుల‌ను స‌రి చేసుకోవ‌చ్చని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 'గ్రూప్-4' కింద 8,039 ఉద్యోగాల భ‌ర్తీకి గతేడాది డిసెంబరు 2న నోటిఫికేష‌న్ వెలువడిన విష‌యం విదిత‌మే. గ్రూప్-4 ఉద్యోగాలకు దాదాపు 9 ల‌క్షల మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో అభ్యర్థులు చిన్నచిన్న పొర‌పాట్లు చేశారు. వీరికోసం అప్లికేషన్ ఎడిట్‌కు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన  అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 11 May 2023 12:04 PM (IST) Tags: TSPSC Jobs TSPSC Recruitment TS Agriculture Officer Posts TSPSC AO Exam Date TSPSC AO Exam Halltickets

సంబంధిత కథనాలు

BDL Jobs: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 12 డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు!

BDL Jobs: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 12 డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు!

MANUU: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 47 టీచింగ్ పోస్టులు!

MANUU: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 47 టీచింగ్ పోస్టులు!

APSFC: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో 20 అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!

APSFC: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో 20 అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందుగానే గేట్లు 'క్లోజ్'! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందుగానే గేట్లు 'క్లోజ్'! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!

THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం -  దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!