(Source: ECI/ABP News/ABP Majha)
Group 4 Application Edit: 'గ్రూప్-4' అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం- తేదీలివే!
గ్రూప్-4 అభ్యర్థుల వినతుల మేరకు తమ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. మే 9 నుంచి 15 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకోవచ్చు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-4 రాత పరీక్షను జులై 1న నిర్వహించనున్నారు. అయితే పలువురు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు చేశారు. దీంతో అభ్యర్థుల వినతుల మేరకు తమ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. మే 9 నుంచి 15 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
'గ్రూప్-4' కింద 8,039 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. గ్రూప్-4 ఉద్యోగాలకు దాదాపు 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు చిన్నచిన్న పొరపాట్లు చేశారు. వీరికోసం అప్లికేషన్ ఎడిట్‌కు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.
ప్రాథమికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంటే 1129 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను తొలిగించింది. పంచాయతీరాజ్ విభాగంలో 1245 పోస్టులకుగాను కొన్నింటికి మాత్రమే ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. మిగిలిన ఖాళీల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల పోస్టుల సంఖ్య తగ్గించాల్సి వచ్చింది. దీంతో కేవలం 37 పోస్టులను మాత్రమే నోటిఫై చేసింది. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో మొత్తంగా 1208 పోస్టులను తొలగించినట్లయింది. మరికొన్ని విభాగాల్లో 79 పోస్టులను పెంచడంతో తొలగించిన మొత్తం పోస్టుల సంఖ్య 1129కి చేరింది.
కొన్ని విభాగాల్లో పెరిగిన ఖాళీలు..
పంచాయతీరాజ్ విభాగంలో 1208 పోస్టులను తొలగించగా.. మరికొన్ని విభాగాల్లో 79 పోస్టులను పెంచారు. వీటిలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీల సంఖ్య ఒక పోస్టు పెరిగి 742 నుంచి 743 కి చేరింది. ఇక రెవెన్యూ విభాగంలో 19 పెరిగాయి. దీంతో ఆ విభాగంలో ఖాళీల సంఖ్య 2077 నుంచి 2096కి పెరిగింది. ఇక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విభాగంలో ఏకంగా 59 కొత్త పోస్టులను చేర్చారు. దీంతో ఈ విభాగంలో 18గా ఉన్న ఖాళీల సంఖ్య ఏకంగా 77 కి చేరింది. దీంతో మొత్తంగా 8039 పోస్టులనే టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.
గ్రూప్-4 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 8039 పోస్టులు
1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238.
2) జూనియర్ అసిస్టెంట్: 5730 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు:
వ్యవసాయశాఖ-44 | బీసీ సంక్షేమశాఖ-307 | పౌరసరఫరాల శాఖ-72 | అటవీశాఖ-23 |
వైద్యారోగ్యశాఖ-338 | ఉన్నత విద్యాశాఖ-743 | హోంశాఖ-133 | నీటిపారుదల శాఖ-51 |
మైనార్టీ సంక్షేమశాఖ-191 | పురపాలక శాఖ-601 | పంచాయతీరాజ్-37 | రెవెన్యూశాఖ-2,096 |
సెకండరీ విద్యాశాఖ-97 | రవాణాశాఖ-20 | గిరిజన సంక్షేమ శాఖ-221 | మహిళా, శిశు సంక్షేమం-77 |
ఆర్థికశాఖ-46 | కార్మికశాఖ-128 | ఎస్సీ అభివృద్ధి శాఖ-474 | యువజన సర్వీసులు-13 |
3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్
4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు
విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒ
గ్కరమార్కు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.