అన్వేషించండి

TGPSC Exam Schedule: సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగ రాతపరీక్షల తేదీలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

TGPSC: తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను టీజీపీఎస్సీ జూన్ 16న విడుదలచేసింది. పరీక్షల షెడ్యూలును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

TSPSC HWO Recuitment:  తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి మూడురోజుల ముందునుంచి అందుబాటులో ఉంచనున్నారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 24.06.2024 -  28.06.2024: ఉదయం సెషన్‌లో (10 AM - 12:30 PM) పేపర్-1 (జనరల్ స్డడీస్), మధ్యాహ్నం సెషన్‌లో (2:30 PM - 5 PM) పేపర్-2 (ఎడ్యుకేషన్) పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ 24.06.2024: ఉదయం సెషన్‌లో (10 AM - 12:30 PM) పేపర్-1 (జనరల్ స్డడీస్), మధ్యాహ్నం సెషన్‌లో (2:30 PM - 5 PM) పేపర్-2 (ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యకేషన్) పరీక్షలు నిర్వహించనున్నారు. 

TGPSC Exam Schedule: సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగ రాతపరీక్షల తేదీలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) 581 ఖాళీల భర్తీకి 2022, డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గతేడాది పేపర్ లీక్, తదితర కారణాల వల్ల పరీక్ష నిర్వహించలేకపోయారు. తాజాగా కమిషన్ పరీక్ష తేదీలను ఖరారుచేసింది.

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 581

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -1): 05 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు: 70
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్): 228
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (): 140
విభాగం: బీసీ వెల్ఫేర్.

➥ వార్డెన్ (గ్రేడ్ -1): 05
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ మ్యాట్రన్ (గ్రేడ్ -1): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ వార్డెన్ (గ్రేడ్-2): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ మ్యాట్రన్ (గ్రేడ్-2): 02
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ లేడి సూప‌రింటెండెంట్: 19
విభాగం: చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో ఉంటాయి.  
                                                     
జీతభత్యాలు..

➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు. 

➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-2) పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.

➨ వార్డెన్, మ్యాట్రన్ (గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు.

➨ వార్డెన్, మ్యాట్రన్(గ్రేడ్-2), లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget