![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, OMR ఆన్సర్ షీట్లు అందుబాటులో, డౌన్‌లోడ్ చేసుకోండి
TGPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
![TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, OMR ఆన్సర్ షీట్లు అందుబాటులో, డౌన్‌లోడ్ చేసుకోండి Telangana Public Service Commission has released TGPSC Group 1 Prelims OMR Sheets download now TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, OMR ఆన్సర్ షీట్లు అందుబాటులో, డౌన్‌లోడ్ చేసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/544b51ecdaa651c881d03f1e6c6842651719236827241522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Group1 Prelims OMR Answer Sheets: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన OMR ఆన్సర్ షీట్లను రాష్ట్రపబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జూన్ 24న సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించిన నేపథ్యంలో.. త్వరలోనే ఫైనల్ కీతోపాటు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే.. అభ్యర్థులకు OMR విధానంలో రాతపరీక్ష నిర్వహించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 897 పరీక్ష కేంద్రాల్లో టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4,03,667 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,03,645 మంది అభ్యర్థలు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో మొత్తం 3,02,172 మంది అభ్యర్థులు (74.86 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ని 'కీ'ని జూన్ 13న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జూన్ 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించింది. ఫైనల్ కీతోపాటు ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేయనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ALSO READ: 'గ్రూప్-2' ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ఉచితంగా గ్రాండ్ టెస్టులు
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు..
➥ అక్టోబరు 21న జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
➥ అక్టోబరు 22న పేపర్-1(జనరల్ ఎస్సే)
➥ అక్టోబరు 23న పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
➥ అక్టోబరు 24న పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
➥ అక్టోబరు 25న పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
➥ అక్టోబరు 26న పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
➥ అక్టోబరు 27న పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)
ALSO READ: టీజీపీఎస్సీ డీఏవో పరీక్ష షెడ్యూలు విడుదల, ఎగ్జామ్ హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
మెయిన్స్ పరీక్ష విధానం..
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను మొత్తం 900 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 7 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరును 150 మార్కులు కేటాయించారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ పేపరును కేవలం అర్హత పరీక్షకాగా.. మిగతా ఆరు పేపర్లను ప్రధాన పేపర్లుగా పరిగణిస్తారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)