అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Group-2 Grand Test: 'గ్రూప్-2' ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ఉచితంగా గ్రాండ్‌ టెస్టులు - దరఖాస్తు ఇలా

BC Study Circle Exam: గ్రూప్‌-2 ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు జులై 5లోగా దరఖాస్తుల సవర్పించాలి.

Group2 Grand Test: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రూప్‌-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 5 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై నెలలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో మొదటి గ్రాండ్‌ టెస్ట్‌; జులై 15, 16 తేదీల్లో రెండో గ్రాండ్‌ టెస్ట్‌; జులై 22, 23 తేదీల్లో మూడో గ్రాండ్‌ టెస్ట్‌; జులై 30, 31 తేదీల్లో నాలుగో గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

గ్రూప్-2 గ్రాండ్ టెస్ట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల (Group2 Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2022-డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు (Group2 Applications) దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2024, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 600 మార్కులకు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.  ఆన్‌లైన్ విధానంలో (సీబీటీ) నిర్వహించే పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు. 

➥ పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు.

➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు.

➥ పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు.  

* గ్రూప్-2 పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 783

  • మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు
  • అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు
  • నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు
  • సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు
  • మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు
  • అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
  • డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు
  • అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
  • అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు
  • అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

గ్రూప్-2 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, భారీగా పెరిగిన అసిస్టెంట్‌ లోకోపైలట్‌ పోస్టుల సంఖ్య, ఏకంగా మూడింతలు
దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్లలో 5,696 అసిస్టెంట్‌ లోకోపైలట్‌(Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరి నెలలో రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఖాళీల సంఖ్యను భారీగా పెంచుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.  ఏకంగా మూడింతలు పెంచడంతో పోస్టుల సంఖ్య 18,799 కి చేరింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Embed widget