TGPSC Group 4 DV: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్, ధ్రువపత్రాల పరిశీలనకు 24 వేలమంది ఎంపిక - షెడ్యూలు ఇదే
TSPSC Group 4: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూలును టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులకు జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు.
TSPSC Group 4 Certificate Verification Schedule: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 24,030 అభ్యర్థులు ఎంపికయ్యారు. అంటే పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1: 3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేశారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అభ్యర్థులకు జూన్ 20 నుంచి ఆగస్టు 21 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10.30 గంటలకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. తేదీలవారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్న అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను కమిషన్ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్-నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతోపాటు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి) ఆవరణలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు.
గ్రూప్-4 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
CERTIFICATES VERIFICATION MATERIAL.
తెలంగాణలో 'గ్రూప్-4' పోస్టుల భర్తీకి 2022, డిసెంబరు 2న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కమిషన్ మొదట విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తర్వాత ఈ పోస్టులకు అదనంగా 141 పోస్టులను జతచేయండంతో.. మొత్తం పోస్టులు సంఖ్య 8,180 కి చేరింది.
రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2203, జులై 1న రాతపరీక్ష నిర్వహించింది. గ్రూప్-4 పరీక్ష కోసం మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు.
గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేయగా.. పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దానికి అనుగుణంగా ఫలితాలను వెల్లడించింది
గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 9న విడుదలయ్యాయి. మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. తాాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెల్లడించింది.
గ్రూప్-4 పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 8,180 పోస్టులు
1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు
2) జూనియర్ అసిస్టెంట్: 5730 పోస్టులు
3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు
4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు
గ్రూప్-4 పోస్టులకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..