అన్వేషించండి

SSC CGLE 2024 Admitcard: సీజీఎల్ - 2024 అడ్మిట్‌కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే - పరీక్ష ఎప్పుడంటే?

CGL Hall Tickets: సీజీఎల్ 2024 పరీక్ష హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 9 నుంచి 26 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

SSC CGLE 2024 Admitcard Out: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్-2024 పోస్టుల భర్తీకి సంబంధించిన 'అడ్మిట్ కార్డులను' స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 9 నుంచి 26 వరకు కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో  చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

సీజీఎల్ టైర్-1 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

టైర్-1 పరీక్ష విధానం:  మొత్తం 200 మార్కులకు టైర్-1 సీబీటీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానంలో అమల్లో ఉంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.5 మార్కులు కోత విధిస్తారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 17,727

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

➥ అసిస్టెంట్

➥ ఇన్‌స్పెక్టర్ - (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)

➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)

➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)

➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్

➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్

➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)

➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)

➥ రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)

➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్  (NIA)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)

➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)

➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)

➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)

➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)

➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్

➥ జూనియర్ అకౌంటెంట్ (CGCA)

➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)

➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

➥  అప్పర్ డివిజన్ క్లర్క్

➥ ట్యాక్స్ అసిస్టెంట్

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

SSC CGL Notification 2024: 17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

టైర్-2 పరీక్ష విధానం:  

SSC CGL Notification 2024: 17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget