News
News
వీడియోలు ఆటలు
X

SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-2021 తుది ఫలితాలు మార్చి 24న విడుదలయ్యాయి. ఎంటీఎస్ (నాన్-టెక్నికల్), హవాల్దార్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-2021 తుది ఫలితాలు మార్చి 24న విడుదలయ్యాయి. ఎంటీఎస్ (నాన్-టెక్నికల్), హవాల్దార్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఏప్రిల్ 6న అభ్యర్థుల మార్కుల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల అర్హతలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో మొదటి జాబితా(లిస్ట్-1)లో ఎంటీఎస్ (నాన్-టెక్నికల్) ఉద్యోగాలకు, రెండో జాబితా(లిస్ట్-1)లో హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఇక మూడో జాబితాలో ఫలితాలు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల వివరాలు ఉన్నాయి.

మొత్తం 7518 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకుగాను 7494 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 3910 మంది మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు, హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) పోస్టులకు 3584 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 126 మంది అభ్యర్థుల నియామకాలకు వేర్వేరు కారణాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెండింగ్‌లో ఉంచింది.

MTS (Non-Technical) - 2021 Final Result

HAVALDAR (CBIC & CBN) - 2021 Final Result

 List of Withheld Candidates

Also Read:

ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)‌ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 200  జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్‌తో పాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 25 Mar 2023 04:52 PM (IST) Tags: SSC MTS Result 2021 SSC MTS Final Result 2021 SSC MTS Final Result SSC MTS 2021 Result SSC MTS 2021 Final Result

సంబంధిత కథనాలు

JIPMER: పుదుచ్చేరి జిప్‌మర్‌లో 122 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు, అర్హతలివే!

JIPMER: పుదుచ్చేరి జిప్‌మర్‌లో 122 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు, అర్హతలివే!

NHAI: ఎన్‌హెచ్‌ఏఐలో 50 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

NHAI: ఎన్‌హెచ్‌ఏఐలో 50 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

TSPSC: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి, ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు!

TSPSC: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి, ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

టాప్ స్టోరీస్

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్