SSC Delhi Police Recruitment: ఢిల్లీపోలీస్ హెడ్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ప్రస్తుతానికి సదరన్ రీజియన్, ఈస్ట్ రీజియన్, నార్త్-ఈస్ట్ రీజియన్లకు సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆయా రీజియన్ల వెబ్‌సైట్లలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.
ఢిల్లీపోలీస్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పరీక్ష హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి సదరన్ రీజియన్, ఈస్ట్ రీజియన్, నార్త్-ఈస్ట్ రీజియన్లకు సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆయా రీజియన్ల వెబ్‌సైట్లలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ స్టేటస్ వివరాలను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.
ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి జులై 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 10 నుంచి 20 వరకు ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్(మినిస్ట్రీరియల్) రాతపరీక్ష నిర్వహించనున్నారు.
SR Region:
Know your Application Status | Know Your Roll Number, Time, Date and Place of Computer Based Examination
ER Region: Know your Application Status | Website
NER Region: Know your Application Status & Admit Card
రాతపరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఐదు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు, కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి.
* పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెజర్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఢిల్లీ పోలీసు విభాగం ఢిల్లీలో మాత్రమే ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తుంది. వీటి తర్వాత స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ నిర్వహించిన తుది జాబితా ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎంఆర్) అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ చేసుకోండి
అగ్నివీర్ (ఎంఆర్ -01/2022 నవంబరు) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇండియన్ నేవీ విడుదల చేసింది. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు లాగిన్ పేజీలో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి మాత్రమే అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు ద్వారా లేదా మరే ఇతర విధానాల ద్వారా అడ్మిట్ కార్డు రాదని అభ్యర్థులు గమనించగలరు.
హాల్‌టికెట్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
UPSC: యూపీఎస్సీ నుంచి 54 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు ఇవే!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 43 లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ డీఎన్‌ఏ) విభాగంలో 6 పోస్టులు, ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టుల చొప్పున భర్తీ చేస్తారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC CGL Notification 2022: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..