UPSC: యూపీఎస్సీ నుంచి 54 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు ఇవే!
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 43 లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ డీఎన్‌ఏ) విభాగంలో 6 పోస్టులు, ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టుల చొప్పున భర్తీ చేస్తారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
* పోస్టుల సంఖ్య: 54
1) సీనియర్ ఇన్‌స్ట్రక్టర్: 01
విభాగం: ఫిషింగ్ బయాలజీ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ (CIFNET), కొచ్చిన్) - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డెయిరింగ్ మినిస్టీరియల్.
అర్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎంఎస్సీ (మెరైన్ బయాలజీ/జువాలజీ/ఫిషరీస్ సైన్స్) లేదా తత్సమాన విద్యార్హత.
అనుభవం: 3 సంవత్సరాలు.
గరిష్ఠ వయసు: 35 సంవత్సరాలు.
Also Read: SSC: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
2) డిప్యూటీ డైరెక్టర్ (PwBD): 01
విభాగం: కంప్యూటర్ & సిస్టమ్ డివిజన్ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్.
అర్హత: ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్స్).
అనుభవం: అవసరంలేదు.
గరిష్ఠ వయసు: 50 సంవత్సరాలు.
3) సైంటిస్ట్-బి: 06 పోస్టులు
విభాగం: ఫోరెన్సిక్ డీఎన్‌ఏ - సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్.
అర్హత: ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్స్).
అనుభవం: అవసరంలేదు.
గరిష్ఠ వయసు: 50 సంవత్సరాలు.
4) జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఎక్స్‌ప్లోజివ్స్ - సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్.
అర్హత: ఎంఎస్సీ(కెమిస్ట్రీ)/అసోసియేట్‌షిప్ డిప్లొమా (ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి).
అనుభవం: 3 సంవత్సరాలు.
గరిష్ఠ వయసు: 30 సంవత్సరాలు.
Also Read: SSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
5) సైంటిస్ట్-బి: 01 పోస్టు
విభాగం: కెమిస్ట్రీ - సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్, న్యూఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ & గంగా రెజువెనేషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి.
అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ).
అనుభవం: 3 సంవత్సరాలు.
గరిష్ఠ వయసు: 40 సంవత్సరాలు.
6) సైంటిస్ట్-బి: 01 పోస్టు
విభాగం: జియోఫిజిక్స్ - సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్, న్యూఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ & గంగా రెజువెనేషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి.
అర్హత: మాస్టర్ డిగ్రీ (జియోఫిజిక్స్).
అనుభవం: 3 సంవత్సరాలు.
గరిష్ఠ వయసు: 38 సంవత్సరాలు.
7) సైంటిస్ట్-బి: 01 పోస్టు
విభాగం: జియోలజీ - సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్, న్యూఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ & గంగా రెజువెనేషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి.
అర్హత: మాస్టర్ డిగ్రీ (జియోలజీ).
అనుభవం: 3 సంవత్సరాలు.
గరిష్ఠ వయసు: 35 సంవత్సరాలు.
8) లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (సెంట్రల్): 42 పోస్టులు
విభాగం: ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్), మినిస్ట్రీ ఆఫ్ లేబర్ & ఎంప్లాయ్‌మెంట్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (కామర్స్/ ఎకనామిక్స్/ సోషియాలజీ/ సోషల్ వర్క్) అర్హత ఉండాలి. డిప్లొమా (లా/లేబర్ వెల్ఫేర్/ లేబర్ లా/ లేబర్ రిలేషన్స్/ సోషియాలజీ/ కామర్స్/సోషల్ వర్క్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/వెల్ఫేర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/పర్సనల్ మేనేజ్‌మెంట్
అనుభవం: ఏడాది.
గరిష్ఠ వయసు: 30 సంవత్సరాలు.
Also Read: భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు, పోస్టులు-అర్హతల వివరాలు ఇలా!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.09.2022 (23:50)
* దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 30.09.2022 (23:59)
Notification
Online Application
Official Website