అన్వేషించండి

AP DSC 1998 Jobs: డీఎస్సీ క్వాలిఫై అయిన 24 ఏళ్ల తరువాత టీచర్ జాబ్, భిక్షాటన చేస్తూ దీనస్థితిలో ఆ వ్యక్తి ! Viral Video

AP DSC 1998 Jobs: కాలం కలిసిరాకపోవడంతో దుర్భర స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్టున్నారు. కానీ దాదాపు పాతికేళ్లకు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇదంతా విని ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.

ఆయనకు చదువంటే ఇష్టం. చదువు చెప్పడం అంటే మరింత మక్కువ. కానీ కాలం కలిసిరాకపోవడంతో దుర్భర స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్టున్నారు. కానీ దాదాపు పాతికేళ్లకు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇదంతా విని ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారు. కానే కాదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి రియల్ స్టోరీ ఇది. కానీ ఈ వయసులో టీచర్ జాబ్ ఎవరెవరికి ఇస్తారు, ప్రభుత్వం తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

1998లో డీఎస్సీ క్వాలిఫై.. కానీ !
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అల్లక కేదారేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఈయన చేనేత కార్మికుల కుటుంబంలో  జన్మించారు. చాలా ఏళ్ల కిందటే డిగ్రీ పూర్తి చేశారు. టీచర్ కావాలన్న లక్ష్యంతో అన్నా మలై విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ కూడా చేశారు. 1994 డీఎస్సీలో కొన్ని మార్కుల తేడాతో జాబ్ రాలేదు. అయినా నిరుత్సాహ పడకుండా 1998లో డీఎస్సీ రాశారు. క్వాలిఫై అయినా రిక్రూట్‌మెంట్ వివాదం కోర్టుకు చేరడంతో అభ్యర్థుల ఎంపిక నిలిచిపోయింది. ఏళ్లు గడిచినా ప్రయోజనం లేకపోయంది. కానీ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆశలు చిగురించాయి.

24 ఏళ్ల తరువాత టీచర్ జాబ్.. 
డీఎస్సీలో క్వాలిఫై అయినా కోర్టు వివాదాలతో ఫలితాల ప్రకటన వాయిదా పడటంతో ఆశలు వదులుకున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు దుస్తులు విక్రయించారు. ఆపై ఆటో నడుపుతూ జీవనం సాగించారు కేదారేశ్వరరావు. ఇవేమీ కలిసిరాకపోవడంతో ఉపాధి నిమిత్తం పదేళ్ల కిందట తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొద్ది రోజులకు కన్నతల్లీ అదృశ్యమైంది. దీంతో ఒంటరిగా తిరిగి గ్రామానికి చేరుకుని ధీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని గ్రామస్తులు తెలపడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. బిక్షాటన చేస్తూ జీవితంపై తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో ఉద్యోగాలపై సీఎం ప్రకటన రావడంతో ఎలా స్పందించాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సర్టిఫికెట్లు అన్ని ఉన్నాయి..
1994లో రావాల్సిన ఉద్యోగం, 1996లో కూడా పాసైనట్లు కేదారేశ్వరరావు తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల జాబ్ రాలేదన్నారు. అయితే 1998లో క్వాలిఫై అయ్యానని, ఇన్నేళ్ల తరువాత ఉద్యోగం వచ్చిందని చెప్పారు. చంద్రబాబు వేసిన ఉద్యోగాలు అని, కానీ ఆయన హయాంలో ఇవ్వలేదని, ఇన్నేళ్ల తరువాత కనికరం పుట్టిందన్నారు. తన వద్ద సెల్ ఫోన్ లేదని, తనకు సమాచారం ఇంకా అందలేదని చెప్పారు.

Also Read: CM Jagan Review Job Calendar : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, 8 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు

Also Read: TS Govt Jobs : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget