అన్వేషించండి

CM Jagan Review Job Calendar : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, 8 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు

CM Jagan Review Job Calendar : 2021–22 జాబ్‌ క్యాలెండర్ లో 39,654 పోస్టులు భర్తీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. మరో 8 వేలకు పైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan Review Job Calendar :   జాబ్ క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం జగన్ భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆరా తీశారు. ఏడాదిగా రిక్రూట్మెంట్ సహా భర్తీ చేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్‌ చేసిన పోస్టుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌పై సమగ్రంగా సీఎం చర్చించారు. 2021-22లో 39,654 పోస్టులు భర్తీ చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. వివిధ శాఖాల్లో 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను ఒక్క ఏడాదిలో పూర్తి చేసినట్టు తెలిపారు. మరో 8 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. 

8 వేలకు పైగా పోస్టులు త్వరలో భర్తీ 

జాబ్‌ క్యాలెండర్‌లో 8 వేలకుపైగా పోస్టులు త్వరలో భర్తీ చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీలపై దృష్టి పెట్టాలని, పోలీసు ఉద్యోగాలపై కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ రూపొందించి ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం సూచించారు. వైద్యారోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా భర్తీ చేయాలని సూచించారు. ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలన్నారు. మిగిలిన  పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. 

పోలీసు ఉద్యోగాల భర్తీపై 

విద్య, వైద్యశాఖల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడం సరికాదన్న సీఎం జగన్,  భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవన్నారు. ఉన్నత విద్యలో పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత వేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం అన్నారు. రెగ్యులర్‌ పోస్టులు, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు జరగాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 

39,654ల పోస్టుల భర్తీ 

2021–22లో 39,654 పోస్టులను భర్తీచేసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేశామన్న అధికారులు, గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం  పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఏడాదిలో పూర్తి చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50 వేల మందిని తీసుకున్నామన్నారు. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. . 

 

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget