PGCIL Recruitment: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 800 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు - అర్హతలివే!
సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 800 పోస్టులు
1. ఫీల్డ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 50
2. ఫీల్డ్ ఇంజినీర్(ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్): 15
3. ఫీల్డ్ ఇంజినీర్(ఐటీ): 15
4. ఫీల్డ్ సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్): 480
5. ఫీల్డ్ సూపర్‌వైజర్(ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్): 240
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 11.12.2022 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.30000- రూ.120000; ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ.23000-రూ.105000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 21.11.2022.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 11.12.2022.
Also Read:
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నోయిడాలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. సంబధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 30 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
జిప్‌మర్‌లో 136 సీనియర్ రెసిడెంట్ పోస్టులు- దరఖాస్తుచేసుకోండి!
పుదుచ్చేరి, కరైకాల్‌లోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ), ఎండీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబరు 9వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..