అన్వేషించండి

PGCIL Recruitment: పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ (లా) పోస్టులు, వివరాలు ఇలా

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- క్లాట్‌ 2024 స్కోరు ద్వారా ఆఫీసర్ ట్రైనీ(లా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- క్లాట్‌ 2024 స్కోరు ద్వారా ఆఫీసర్ ట్రైనీ(లా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్‌ఎల్‌బీ లేదా ఇంటిగ్రేటెడ్ లా/ ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉత్తీర్ణతతో పాటు క్లాట్‌-2024 స్కోరు సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబరు 09 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్‌-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.  

వివరాలు..

* ఆఫీసర్ ట్రైనీ(లా) పోస్టులు

మొత్తం ఖాళీలు: 10

పోస్టుల కేటాయింపు: జనరల్- 05, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)-02, ఎస్సీ- 01, ఎస్టీ- 01. వీటిలో దివ్యాంగులకు 1 పోస్టును కేటాయించారు.

ఇండక్షన్ స్థాయి: ఆఫీసర్ ట్రైనీ - లా (OT-లా) ప్రారంభ ఒక సంవత్సరం శిక్షణ కోసం. ఆఫీసర్ (లా) - శిక్షణ పూర్తయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో E-2 లెవెల్.

అర్హత: 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా ఇంటిగ్రేటెడ్ లా/ ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉత్తీర్ణతతో పాటు క్లాట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 29.11.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులు/ అల్లర్ల బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమదరఖాస్తులను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పవర్‌గ్రిడ్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను నమోదు చేసి సమర్పించే ముందు, అభ్యర్థి చెల్లుబాటయ్యే ఇ-మెయిల్ ఐడి, ప్రత్యామ్నాయ ఈ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. ఇది తప్పనిసరి. ఒకవేళ అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడి లేకపోతే, అతను/ఆమె ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు అతని/ఆమె కొత్త ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేయాలి. నియామక ప్రక్రియ యొక్క తరువాతి దశలలో అభ్యర్థి లాగిన్ ద్వారా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇవి అవసరమవుతాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో నమోదు చేసిన ఈ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌ను కనీసం ఒక సంవత్సరం పాటు తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉంచుకోవాలి.

ఎంపిక విధానం: క్లాట్‌-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గ్రూప్ డిస్కషన్‌/ఇంటర్వ్యూ/పవర్‌గ్రిడ్‌లో చేరే సమయంలో వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తమ క్లాట్‌-2024 అడ్మిట్ కార్డ్/హాల్ టిక్కెట్‌ని కలిగి ఉండాలి. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో క్లాట్‌-2024 స్కోర్ 85 శాతం మార్కులు, గ్రూప్ డిస్కషన్‌ను 3 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు 12 శాతం మార్కులు కేటాయించారు.

క్లాట్‌-2024 అర్హత మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.

ఇంటర్వ్యూ అర్హత మార్కులు: ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.

శిక్షణ కాలంలో స్టైఫండ్: రూ. 40,000.

జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

సర్వీస్ అగ్రిమెంట్ బాండ్: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేయనున్నట్లు రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2.5 లక్షలకు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.11.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.11.2023.

Notification

Website

ALSO READ:

➥ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే గ్రూప్-1, గ్రూప్- 2 నోటిఫికేషన్లు- ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు 

ఎయిమ్స్‌- గోరఖ్‌పుర్‌లో 142 నాన్ టీచింగ్ పోస్టులు 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Embed widget