ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు, మార్చి 30 లాస్ట్ డేట్
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులు భర్తీ చేయనుంది.
ఆయిల్ కంపెనీల్లో పని చేసిన రిటైర్ అయిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది ఓఎన్‌జీసీ. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో 36 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వేసింది. జూనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయనుందా సంస్థ. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 ఉద్యోగాలను ఫిల్ చేయనుంది. ఇందులో జూనియర్ కన్సెల్టెంట్ పోస్టులు 14 ఉంటే అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులు 22 ఉన్నాయి.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో రిటైర్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆయా విభాగాల్లో సుమారు ఐదేళ్లు అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయోపరిమితి 65ఏళ్లు మించి ఉండరాదని నోటిఫికేషన్‌లో పేర్కొంది ఓఎన్‌జీసీ. ఇందులో ఎంపికైన వాళ్లకు నలభై వేల నుంచి అరవై ఆరువేల వరకు జీతం ఇస్తారు.
Their chirps & knocks on the window pane have been the morning alarm for years. On #WorldSparrowDay2022 let us spare a thought for the humble sparrow whose numbers continue to dwindle. pic.twitter.com/W21bjCypAB
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 20, 2022
అర్హులైన అభ్యర్థుల దరఖాస్తు పరిశీలించి వాళ్లకు ముందుగా రాత పరీక్ష పెడుతుంది. అనంతరం వాళ్లను ఇంటర్వ్యూలకు పిలుస్తుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 30 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అనుభవ పత్రాలను అప్లికేషన్‌ను సైన్ చేసి స్కాన్ కాపీలను BHARGAVA_VIKAS@ONGC.CO.INకు మెయిల్ చేయాలి.
లీగల్ అడ్వైజర్‌ల నియామకానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. నాలుగు పోస్టులను భర్తీ చేయనుందీ నోటిఫికేషన్ ద్వారా. ఇందులో ఎంపికైన వారికి అరవై వేల నుంచి లక్షా ఎనభై వేల వరకు జీతం ఇవ్వనుంది. దీనికి 18 ఏళ్లు నిండి ఉండి 30 ఏళ్లకు మించని వాళ్లంతా అర్హులు. లా ప్రాక్టీస్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. మూడేళ్ల అనుభవం ఉండాలి.
ఇక బీజేపీ , టీఆర్ఎస్ మధ్య ఎస్టీ రిజర్వేషన్ల మంటలు - కేంద్రమంత్రి సమాధానంతో ప్రారంభమైన రచ్చ !
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మరోసారి కేంద్రం క్లారిటీ, లోక్‌సభలో మంత్రి కుండబద్దలు