అన్వేషించండి

NTPC: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 110 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు.

NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 3వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

వివరాలు..

* డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 110 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

⏩ డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్): 20 

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

⏩ డిప్యూటీ మేనేజర్(మెకానికల్ ఎరేక్షన్): 50 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ (మెకానికల్/ప్రొడక్షన్) ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

⏩ డిప్యూటీ మేనేజర్(సి అండ్‌ ఐ ఎరెక్షన్‌): 10 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/కంట్రోల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

⏩ డిప్యూటీ మేనేజర్(సివిల్ కన్‌స్ట్రక్షన్): 30

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ (సివిల్/కన్‌స్ట్రక్షన్) ఉత్తీర్ణులై ఉండాలి

అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం: నెలకు రూ.70,000 - రూ.2,00,000.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 23.02.2024.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 08.03.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
Prakash Raj: 'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!' - నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!' - నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Embed widget