(Source: ECI/ABP News/ABP Majha)
NIRDPR: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో కన్సల్టెంట్, అకౌంట్స్ & అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్) కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్, అకౌంట్స్ & అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 24.
* కన్సల్టెంట్: 19
➤ సెంటర్ ఫర్ పంచాయితీ గవర్నెన్స్, ఇ-గవర్నెన్స్ & సర్వీస్ డెలివరీ: 02
➤ పంచాయతీ ఫైనాన్స్, అకౌంట్స్ & ఆడిట్ కోసం కేంద్రం: 01
➤ ఎస్‌డీజీల స్థానికీకరణ కేంద్రం, సమీకృత పంచాయతీప్లానింగ్ & కన్వర్జెన్స్: 02
➤ సెంటర్ ఫర్ పబ్లిక్ హెల్త్, శానిటేషన్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీల ద్వారా అభివృద్ధి: 02
➤ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంటల్ అప్‌గ్రేడేషన్ & పంచాయతీల ద్వారా నిర్మించిన పర్యావరణం: 02
➤ సెంటర్ ఫర్ స్కిల్లింగ్ & ఎకనామిక్ డెవలప్‌మెంట్ ద్వారా పంచాయతీలు: 02
➤ సెంటర్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్(ఆరోగ్యం, విద్య, మహిళలు & పిల్లలు) పంచాయతీ: 02
➤ సెంటర్ ఫర్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ & డిస్ప్యూట్ రెజల్యూషన్ పంచాయతీ: 02
➤ పంచాయతీ గణాంకాల కేంద్రం, పంచాయతీ విధానం సంస్కరణలు & న్యాయవాదం: 02
➤ ఐటీ ఫర్ ఇ-గవర్నెన్స్ & ఎంఐఎస్: 02
* ట్రైనింగ్, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్: 05
అర్హత: ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపునుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.1,00,000; ట్రైనింగ్, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్‌కు రూ.40,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.08.2023.
ALSO READ:
ఏపీఎస్‌ఆర్‌టీసీ విజయనగరం జోన్‌లో అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ) విజయనగరం జోన్ ఐటిఐ ట్రేడుల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విజయనగరంలోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 18, 19, 21 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 647 గ్రాడ్యుయేట్ & డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
HAL Jobs 2023: నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్ & డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇస్రో-సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో 56 ఖాళీలు - ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 4న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 24 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.