(Source: ECI/ABP News/ABP Majha)
ISRO Jobs: ఇస్రో-సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో 56 ఖాళీలు - ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 4న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 24 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికలు చేపడతారు.
ఖాళీల వివరాలు..
* మొత్తం పోస్టుల సంఖ్య: 56.
1) క్యాటరింగ్ సూపర్‌వైజర్: 01 పోస్టు
అర్హతలు, అనుభవం..
➥ హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ/ హోటల్ మేనేజ్‌మెంట్ & కేటరింగ్ టెక్నాలజీ/ హాస్పిటాలిటీ & హోటటల్ అడ్మినిస్ట్రేషన్/ కేటరింగ్ సైన్స్ & హోటల్ మేనేజ్‌మెంట్. ఏడాది అనుభవం ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా ఇన్ కేటరింగ్. మూడేళ్ల అనుభవం ఉండాలి. (లేదా)
➥ పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్. రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.35,400- రూ.1,12,400
2) నర్స్-బి: 07 పోస్టులు
అర్హత: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడేళ్లకు తగ్గకుండా డిప్లొమా (నర్సింగ్) కోర్సు చేసి ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.
జీతం: రూ.44,900- రూ.1,42,400.
3) ఫార్మసిస్ట్-ఎ: 02 పోస్టులు
అర్హత: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్లకు తగ్గకుండా డిప్లొమా (ఫార్మసీ) కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.29,200- రూ.92,300.
4) రేడియోగ్రాఫర్-ఎ: 04 పోస్టులు
అర్హత: ఫస్ట్ క్లాస్ డిప్లొమా (రేడియోగ్రఫీ) కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.25,500- రూ.81,100.
5) ల్యాబ్ టెక్నీషియన్-ఎ: 01 పోస్టు
అర్హత: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఫస్ట్ క్లాస్ డిప్లొమా (మెడికల్ ల్యాబొరేటరీ) కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.25,500 - రూ.81,100.
6) ల్యాబ్ టెక్నీషియన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్): 01 పోస్టు
అర్హత: డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఫస్ట్ క్లాస్ డిప్లొమా (డెంటల్ హైజీన్) కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ..25,500 - రూ.81,100.
7) అసిస్టెంట్(రాజ్‌భాష): 01 పోస్టు
అర్హత: 60 శాతం (6.32 జీపీ) మార్కులతో డిగ్రీ. హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 25 పదాలు టైప్ చేయగలగాలి. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ..25,500 - రూ.81,100.
8) కుక్: 04 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
జీతం: రూ.19,900- రూ.63,200.
9) లైట్ వెహికల్ డ్రైవర్- ఎ: 13 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. లైట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.
10) హెవీ వెహికల్ డ్రైవర్-ఎ: 14 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. అందులో కనీసం 3 సంవత్సరాలు హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.
11) ఫైర్‌మ్యాన్-ఎ: 08 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.
వయోపరిమితి: 24.08.2023 నాటికి అసిస్టెంట్ పోస్టులకు 18-28 సంవత్సరాలు; ఫైర్‌మ్యాన్ పోస్టులకు 18-25 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 04.08.2023
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 24.08.2023.
➥ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 25.08.2023.
ALSO READ:
పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 30 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి!
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
1207 'స్టెనోగ్రాఫర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2023 ప్రకటనను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..