NCERT: ఎన్‌సీఈఆర్టీలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు, వివరాలు ఇలా
NCERT Recruitment: న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్టీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
NCERT Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్టీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 1 నుంచి ఫిభ్రవరి 3 వరకు ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 170
⏩ అసిస్టెంట్ ఎడిటర్: 60 పోస్టులు
సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: ఇంగ్లీష్- 25 హిందీ- 25 & ఉర్దూ- 10.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (బుక్ పబ్లిషింగ్/మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం, ఎడిటింగ్ సబ్జెక్ట్), ఎడిటింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు.
వేతనం: నెలకు రూ.80,000.
పదవీకాలం: నాలుగు నెలలు.
స్క్రీనింగ్ మరియు నమోదు తేదీ: 01.02.2024 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
నైపుణ్య పరీక్ష తేదీ: 03.02.2024.
⏩ ప్రూఫ్ రీడర్: 60 పోస్టులు
సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: ఇంగ్లీష్- 25 హిందీ- 25 & ఉర్దూ- 10.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్/హిందీ/ఉర్దూ)తో పాటు కాపీ హోల్డర్/ప్రూఫ్ రీడర్‌గా ప్రింటింగ్ లేదా పబ్లిషింగ్ ఆర్గనైజేషన్ నుంచి కనీసం 01 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు.
వేతనం: నెలకు రూ.37,000.
పదవీకాలం: నాలుగు నెలలు.
స్క్రీనింగ్ మరియు నమోదు తేదీ: 01.02.2024 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
నైపుణ్య పరీక్ష తేదీ: 02.02.2024.
⏩ డీటీపీ ఆపరేటర్: 50 పోస్టులు
సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: ఇంగ్లీష్- 20 హిందీ- 20 & ఉర్దూ- 10.
అర్హత: ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, గుర్తింపు పొందిన సంస్థ నుంచి డెస్క్ టాప్ పబ్లిషింగ్‌లో ఒక సంవత్సరం డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు, పబ్లిషింగ్ హౌస్‌లో పాఠ్యపుస్తకాల తయారీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇన్-డిజైన్, ఫోటోషాప్, ఇల్‌స్ట్రేటర్, ఈక్వేషన్ ఎడిటర్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్& పేజ్-మేకర్, హిందీ మరియు ఇంగ్లీషు రెండింటిలోనూ టైపింగ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు.
వేతనం: నెలకు రూ.50,000.
పదవీకాలం: నాలుగు నెలలు.
స్క్రీనింగ్ మరియు నమోదు తేదీ: 01.02.2024 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
నైపుణ్య పరీక్ష తేదీలు: 02, 03.02.2024.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 01.02.2024 నుంచి 03.02.2024 వరకు.
వేదిక: Publication Division, NCERT, Sri Aurobindo Marg, New Delhi-110016
ALSO READ:
CRPF: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు, వీరిక ప్రత్యేకం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ (Constable-General Duty) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..