NRSC: ఎన్ఆర్ఎస్సీ హైదరాబాద్‌లో రిసెర్చ్ పర్సనల్ పోస్టులు, వివరాలు ఇలా
NRSC Recruitment: హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ రిసెర్చ్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NRSC Recruitment: హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ రిసెర్చ్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 71.
⏩ రిసెర్చ్ సైంటిస్ట్: 20 పోస్టులు
పోస్టు కోడ్..
➥ RS10- 03 పోస్టులు
➥ RS11- 04 పోస్టులు
➥ RS12- 04 పోస్టులు
➥ RS13- 01 పోస్టు
➥ RS14- 05 పోస్టులు
➥ RS15- 01 పోస్టు
⏩ ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 06 పోస్టులు
పోస్టు కోడ్..
➥ PS02- 06
⏩ ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి: 04 పోస్టులు
పోస్టు కోడ్..
➥ PSB01- 04 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ అసోసియేట్-I: 02 పోస్టులు
పోస్టు కోడ్..
➥ PA03- 02 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ అసోసియేట్-II: 12 పోస్టులు
పోస్టు కోడ్..
➥ PA201- 12 పోస్టులు
⏩ జూనియర్ రిసెర్చ్ ఫెలో: 27 పోస్టులు
పోస్టు కోడ్..
➥ JRF13- 01 పోస్టు
➥ JRF14- 01 పోస్టు
➥ JRF15- 07 పోస్టులు
➥ JRF16- 06 పోస్టులు
➥ JRF17- 01 పోస్టు
➥ JRF18- 01 పోస్టు
➥ JRF19- 01 పోస్టు
➥ JRF20- 03 పోస్టులు
➥ JRF21- 03 పోస్టులు
➥ JRF22- 01 పోస్టు
➥ JRF23- 01 పోస్టు
➥ JRF24- 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
జేఆర్‌ఎఫ్ పోస్టులు: యూఆర్/ఈడబ్లూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు.
రిసెర్చ్ సైంటిస్ట్(M.Sc ఆధారిత): యూఆర్/ఈడబ్లూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు.
రిసెర్చ్ సైంటిస్ట్ (M.Tech ఆధారిత): యూఆర్/ఈడబ్లూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు.
ప్రాజెక్ట్ అసోసియేట్-I & II: యూఆర్/ఈడబ్లూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు.
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: యూఆర్/ఈడబ్లూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు.
ప్రాజెక్ట్ అసోసియేట్-II: యూఆర్/ఈడబ్లూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
పని ప్రదేశం: ఎన్‌ఆర్‌ఎస్సీ క్యాంపస్‌లు- షాద్‌నగర్ (రంగారెడ్డి జిల్లా); జీడిమెట్ల/ బాలానగర్ (హైదరాబాద్); రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు- నాగ్‌పుర్, న్యూఢిల్లీ, కోల్‌కతా, జోధ్‌పుర్, బెంగళూరు.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.03.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.04.2024.