NHB Recruitment: నేషనల్ హౌజింగ్ బ్యాంకులో 36 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. జనవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
న్యూఢిల్లీలోని నేషనల్ హౌజింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మేనేజర్, ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. జనవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 36
1) జనరల్ మేనేజర్: 01
2) డిప్యూటీ జనరల్ మేనేజర్: 02
3) అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 05
4) రీజినల్ మేనేజర్: 08
5) మేనేజర్: 07
6) డిప్యూటీ మేనేజర్: 10
7) చీఫ్ ఎకనమిస్ట్: 01
8) ప్రొటోకాల్ ఆఫీసర్: 02
విభాగాలు: ప్రాజెక్ట్ ఫైనాన్స్, లీగల్ రికవరీ, కంపెనీ సెక్రటరీ, క్రెడిట్, ఎంఐఎస్, ఎకనమిస్ట్, ఐటీ, లీగల్ & రికవరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ప్రొటొకాల్ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఇంజినీరింగ్ డిగ్రీ/ సీఏ/ ఎంసీఏ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 23-55 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.48,170-రూ.1,29,000 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.850.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.01.2023.
➥ దరఖాస్తు చివరి తేది: 06.02.2023.
Also Read:
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, 111 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో శాశ్వత ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టీసీఎస్ 'స్మార్ట్ హైరింగ్-2023', ఫ్రెషర్స్‌కు ప్రత్యేకం!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంస్థ 'టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2023' ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన అభ్యర్థులు టీసీఎస్ ఇగ్నైట్‌లోని 'సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్'లో చేరే అవకాశాన్ని పొందుతారు. డిగ్రీ ఫ్రెషర్స్, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
హైరింగ్ వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1904 ఖాళీలు - పోస్టులు, అర్హతల పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి 6 ప్రకటనలు జారీ చేసింది. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
జిల్లా కోర్టుల ఖాళీల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..