UPSC Jobs: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, 111 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో శాశ్వత ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 111
➥డిప్యూటీ కమిషనర్ (హార్టికల్చర్): 01 పోస్టు
➥ అసిస్టెంట్ డైరెక్టర్(టాక్సికాలజీ): 01 పోస్టు
➥ రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్(రబ్బర్ బోర్డు): 01 పోస్టు
➥ సైంటిస్ట్-బి(నాన్-డిస్ట్రక్టివ్): 01 పోస్టు
➥ సైంటిఫిక్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు
➥ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్: 01 పోస్టు
➥ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (టెక్నికల్): 06 పోస్టులు
➥ అసిస్టెంట్ డైరెక్టర్ (ఐటీ): 04 పోస్టులు
➥ సైంటిస్ట్-బి(టాక్సికాలజీ): 01 పోస్టు
➥ సైంటిస్ట్-బి(సివిల్ ఇంజినీరింగ్): 09 పోస్టులు
➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్): 76 పోస్టులు
➥ డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సెల్ (హిందీ బ్రాంచ్): 03 పోస్టులు
➥ అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్-1: 04 పోస్టులు
➥ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల ప్రకారం.
దరఖాస్తు రుసుము: రూ.25.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.01.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 02.02.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటింగ్‌కు చివరితేది: 03.02.2023.
Also Read:
తెలంగాణ హైకోర్టులో 20 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
తెలంగాణ హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 10, బీసీలకు 6, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..