By: ABP Desam | Updated at : 14 Jan 2023 04:51 PM (IST)
Edited By: omeprakash
టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ - 2023
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంస్థ 'టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2023' ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన అభ్యర్థులు టీసీఎస్ ఇగ్నైట్‌లోని 'సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్'లో చేరే అవకాశాన్ని పొందుతారు. డిగ్రీ ఫ్రెషర్స్, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఉత్తీర్ణత సాధించిన 2023 సంవత్సరం నుంచి అభ్యర్థులకు ఒక బ్యాక్‌లాగ్ మాత్రమే అనుమతిస్తారు. అయితే పెండింగ్‌లోని అన్ని బ్యాక్‌లాగ్‌లను నిర్ణీత కోర్సు వ్యవధిలో పూర్తి చేయాలి. అకడమిక్ విద్యలో ఖాళీలు ఏవైనా ఉంటే అభ్యర్థులు వాటిని దరఖాస్తు సమయంలో పేర్కొనాలి. మొత్తం అకడమిక్ గ్యాప్ 2 సంవత్సరాలకు మించకూడదు. దానికి సంబంధించిన ధ్రువపత్రాలు ఉండాలి. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అభ్యర్థులకు ట్రెండింగ్ టెక్నాలజీలపై శిక్షణ ఇస్తారు.
వివరాలు...
* టీసీఎస్ స్మార్ట్ హైరింగ్-2023
అర్హత: బీసీఏ/ బీఎస్సీ (గణితం, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ)/ బీవొకేషనల్(సీఎస్/ ఐటీ) ఉత్తీర్ణత. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయసు: కనీసం 18-28 సంవత్సరాలు ఉండాలి.
పని ప్రదేశం: దేశవ్యాప్తంగా పని చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. టీసీఎస్ ఐయాన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష సమయం 50 నిమిషాలు. వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు చివరి తేది: 31.01.2023.
పరీక్ష తేదీ: 10.02.2023.
Also Read:
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1904 ఖాళీలు - పోస్టులు, అర్హతల పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి 6 ప్రకటనలు జారీ చేసింది. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
జిల్లా కోర్టుల ఖాళీల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
హైదరాబాద్ ఈఎస్‌ఐసీలో 106 ఖాళీలు, పోస్టుల వివరాలు ఇలా!
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 106 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషలిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 9 నుంచి 16 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. వీరు జనవరి 20 నుంచి 31 వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. విభాగాలవారీగా ఇంటర్వ్యూ షెడ్యూలును నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!
C-DAC Recruitment: సీడాక్లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
AP Constable Answer Key: కానిస్టేబుల్ అభ్యర్థులకు 'కీ' కష్టాలు, ప్రాథమిక కీలో ఒకలా, ఫైనల్ కీలో మరోలా సమాధానాలు!
CAPF Vacancies 2023: కేంద్ర సాయుధ బలగాల్లో 83 వేల పోస్టులు ఖాళీ, లోక్సభలో కేంద్రం ప్రకటన!
AIIMS Recruitment: ఎయిమ్స్, రిషికేశ్లో 62 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!