News
News
వీడియోలు ఆటలు
X

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎల్‌ఐసీలో ADO ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 10న విడుదల చేసింది. జోన్లవారీగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

FOLLOW US: 
Share:

ఎల్‌ఐసీలో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 10న విడుదల చేసింది. జోన్లవారీగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏడీవో ప్రధాన పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పీడీఎఫ్ రూపంలో మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉన్నాయి.  

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎల్ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 9394  అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భ‌ర్తీకి ఈ ఏడాది జనవరిలో జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. సెంట్రల్ జోన్, నార్తర్న్ జోన్, వెస్ట్రర్న్ జోన్, ఈస్ట్రర్న్ జోన్, సదరన్ జోన్, నార్త్ సెంట్రల్ జోన్, సౌత్ సెంట్రల్ జోన్, ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలో మొత్తం 9394 ఏడీవో పోస్టులను ఎల్ఐసీ భర్తీ చేయనుంది.

ADO ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఏప్రిల్ 8న మెయిన్ పరీక్ష..
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 160 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ నుంచి-50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి-35 ప్రశ్నలు-35 మార్కులు; ఇన్‌స్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ నుంచి-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇక ఎల్‌ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు 160 మార్కులకు‌గాను 100 ప్రశ్నలు ఉంటాయి. 

జీత భత్యాలు ఇలా..
 ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నెలకు రూ.35,650-రూ.90,205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర భత్యాలు అదనం.

నోటిఫికేషన్, జోన్లవారీగా ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

ఇండోర్ ఐఐటీలో 34 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- అర్హతలివే!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ (ఐఐటీ ఇండోర్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 10 Apr 2023 11:02 AM (IST) Tags: LIC ADO Result 2023 licindia in LIC ADO Prelims Result 2023 LIC ADO Main Date 2023 education news

సంబంధిత కథనాలు

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు -  అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు - అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా