Yasasvi Jaiswal Run out vs WI 2nd Test | రెండొందలు కొట్టేవాడు నిరాశగా వెనుదిరిగిన జైశ్వాల్ | ABP Desam
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రఫ్పాడించాడు. విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ మొదటి రోజే పవర్ ఫుల్ కమాండ్ చూపించాడు. అసలు మనోడు చూపిస్తున్న దూకుడుకు డబుల్ సెంచరీ హల్వాపూరీ అనిపించింది. అంత కళ్లముందున్న రికార్డును కెప్టెన్ గిల్ చేసిన చిన్న పొరపాటుతో మిస్ అయ్యాడు యశస్వి జైశ్వాల్. 175పరుగుల మీదున్నప్పుడు జైదెన్ సీలెస్ బౌలింగ్ లో వేసిన బాల్ ను మిడాఫ్ వైపు కొట్టాడు జైశ్వాల్. వాస్తవానికి అది పరుగు రాని బంతే. మిడాఫ్ లో ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు. కానీ జైశ్వాల్ కి కాన్ఫిడెంట్ అనిపించి రన్ కి కాల్ ఇచ్చాడు. గిల్ కూడా బాల్ చూసి ఓకే అని నాలుగు అడుగులు ముందుకు వచ్చేశాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత గిల్ కి అనుమానం వచ్చి నో చెప్పాడు. బట్ అప్పటికే పిచ్ పైకి సగంపైగా వచ్చిన జైశ్వాల్...వెనక్కి తిరిగి వెళ్లే టైమ్ లేక రనౌట్ అయిపోయాడు. రన్ లేదు అనుకున్నప్పుడు కాల్ ఇచ్చినప్పుడే నో చెప్పొచ్చు కదా గిల్. అప్పుడు రెస్పాండ్ అయ్యి జైశ్వాల్ హాఫ్ ఆఫ్ ది పిచ్ వచ్చాక నో చెప్పటంతో కళ్ల ముందే ఉన్న డబుల్ సెంచరీ మిస్ అయిపోయింది. పాపం పూర్ జైశ్వాల్ చేసేది లేక..కెప్టెన్ ను గట్టిగా తిట్టలేక..అసహనం వ్యక్తం చేస్తూ గ్రౌండ్ లోనే తలబాదుకుంటూ నిస్తేజంగా వెళ్లిపోయాడు. బ్యాటర్ల మధ్య కో ఆర్డినేషన్ లేకపోతే జరిగే ఈ తప్పులు పార్ట్ ఆఫ్ ది గేమ్ అయినా తన టీమ్ లో ఉన్న సహచరుల కష్టానికి గుర్తింపు ఇవ్వటం...వాళ్ల స్కోరును కూడా జాగ్రత్తగా తన స్కోరులానే భావించటం కెప్టెన్ కి ఉండాల్సిన లక్షణమంటూ టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.





















