అన్వేషించండి

LIC ADO Notification: ఎల్‌ఐసీలో 9394 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఎంపికైతే నెలకు 90 వేల రూపాయల జీతం! తెలుగు రాష్ట్రాలకు ఎన్నిపోస్టులంటే?

ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన వారితోపాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

లైఫ్ ఇన్‌స్య్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా  నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 9394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో మొత్తం 1408 ఏడీఓ పోస్టులు ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 

వివరాలు..

➦ అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 9394 పోస్టులు 

మొత్తం ఖాళీలు: 9394

జోన్ల వారీగా ఖాళీల వివరాలు..

➥ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్): 561

➥ ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్‌కతా): 1049

➥ ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా): 669

➥ నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూదిల్లీ): 1216

➥ నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్): 1033

➥ సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై): 1516

➥ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1408

➥ వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1942

➥ దక్షిణ మధ్య జోన్‌లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఖాళీలు: 1408.

డివిజన్ల వారీగా ఖాళీలు: కడప- 90, హైదరాబాద్- 91, కరీంనగర్- 42, మచిలీపట్నం- 112, నెల్లూరు- 95, రాజమహేంద్రవరం- 69, సికింద్రాబాద్- 94, విశాఖపట్నం- 57, వరంగల్- 62, బెంగళూరు-1- 115, బెంగళూరు-2- 117, బెల్గాం- 66, ధార్వాడ్- 72, మైసూర్- 108, రాయచూర్- 83, షిమోగా- 51, ఉడిపి- 84.

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్‌ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ/ మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం..

➥ ప్రిలిమినరీ పరీక్ష:

మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. అయితే ఇంగ్లిష్ పరీక్షను (30 మార్కులు) కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. అంటే 75 మార్కులకే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. 

➥ మెయిన్ పరీక్ష:
మొత్తం 160 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ నుంచి-50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి-35 ప్రశ్నలు-35 మార్కులు; ఇన్‌స్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ నుంచి-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇక ఎల్‌ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు 160 మార్కులకు‌గాను 100 ప్రశ్నలు ఉంటాయి. 

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నెలకు రూ.35,650-రూ.90,205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర భత్యాలు అదనం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 10.02.2023.

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ ప్రారంభం: 04.03.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12.03.2023.

➥ మెయిన్ పరీక్షతేదీ: 08.04.2023.

Online Application

Website

Also Read:

SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక  హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Tragedy Incident: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Embed widget