Shubman Gill Century vs WI Second test | ఏడాదిలో కెప్టెన్ గా ఐదో సెంచరీ బాదేసిన గిల్ | ABP Desam
శుభ్ మన్ గిల్ ను టీమిండియా కు కొత్త కెప్టెన్ గా ప్రకటించినప్పుడు అందరిలోనూ ఒకటే అనుమానం. గొప్ప బ్యాటరే సందేహం లేదు. కానీ కెప్టెన్సీ ఇస్తే ఆ భారాన్ని మోయగలడా అని. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తన బ్యాట్ తోనే చెబుతూ పోతున్నాడు ప్రిన్స్ శుభ్ మన్ గిల్. పరుగుల దాహానికి అడ్డే లేదన్నట్లు విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ బాదేసి తన ఫామ్ ను చాటుకున్నాడు. 196బంతుల్లో 16ఫోర్లు 2 సిక్సర్లతో 129పరుగులు చేసి గిల్...నితీశ్ రెడ్డి 43, ధృవ్ జురెల్ 44 పరుగులు చేసి ఔట్ అయిపోవటంతో ఇక ఎక్కువ టైమ్ వేస్ట్ చేయలేదు. వాళ్లు సెంచరీలు చేస్తే చూసేవాడేమో కానీ వాళ్లిద్దరూ హాఫ్ సెంచరీల ముందే ఔట్ అయిపోవటంతో తను 150 కోసమో 200 కోసమే చూడకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చేశాడు. 2025 లో కెప్టెన్ గా ఇది గిల్ కి ఐదో సెంచరీ. 2017,2018 సంవత్సరాల్లో కింగ్ కొహ్లీ మాత్రమే ఇలా కెప్టెన్ గా ఒకే ఏడాది ఐదు సెంచరీలు బాదాడు. అంతే కాదు నెంబర్ 4లో ఆడుతూ కెప్టెన్ గా 5 టెస్ట్ సెంచరీలు చేసి ఆ ఘనత సాధించిన మూడో ఇండియన్ కెప్టెన్ గా నిలిచాడు గిల్. గిల్ కి ముందు సచిన్ కూడా 5 సెంచరీలు...విరాట్ కొహ్లీ 20 సెంచరీలతో చాలా ఎత్తులో ఉన్నాడు. గిల్ ఇలా ఏడాదికి ఐదారు సెంచరీలు చేసుకుంటూ పోతే...పదేళ్ల తర్వాత తను కూడా కొహ్లీ స్థాయిలో నిలబడటం ఖాయం అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్.



















