అన్వేషించండి

TSRTC Recruitment 2025: తెలంగాణ ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

TSRTC Driver Jobs | తెలంగాణ ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

TGSRTC Recruitment 2025 | హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ఇటీవల ఓ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా టీజీఎస్ ఆర్టీసీ మొత్తం 1743 పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు డ్రైవర్, శ్రామిక్ (Mechanic Helper) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

TGSRTC Notification 2025 – పోస్టుల వివరాలు
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ జరగనుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 8న ప్రారంభం కాగా, అక్టోబర్ 28తో తుది గడువు ముగియనుంది. 

ఖాళీల వివరాలు
-  డ్రైవర్ పోస్టులు: 1000
-  శ్రామిక్ పోస్టులు: 743
-  మొత్తం ఖాళీలు: 1743

ఈ పోస్టులను జిల్లాల వారీగా కేటాయించారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ PDFలో అందుబాటులో ఉంటుంది.

డ్రైవర్ పోస్టుకు విద్యార్హతలు:
- 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- హెవీ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
- డ్రైవింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం

శ్రామిక్ పోస్టులకు విద్యార్హతలు:
-  10వ తరగతి లేదా ఐటీఐ (Mechanic/Auto Trades) పూర్తి చేసి ఉండాలి

ఏజ్ లిమిట్
డ్రైవర్ పోస్టులకు: కనీస వయసు: 22 సంవత్సరాలు
గరిష్ట వయసు: 35 సంవత్సరాలు

శ్రామిక్ పోస్టులకు: కనీస వయసు: 18 సంవత్సరాలు
గరిష్ట వయసు: 30 సంవత్సరాలు

వయోపరిమితి సడలింపు: ఎస్సీ / ఎస్టీ / బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు
-  డ్రైవర్ పోస్టులు: నెలకు ₹20,960 – ₹60,080 
-  శ్రామిక్ పోస్టులు: నెలకు ₹16,550 – ₹45,030 నెలకు
పోస్టు, అనుభవం, పనితీరు ఆధారంగా జీతం నిర్ణయిస్తారు

దరఖాస్తు ఫీజు
డ్రైవర్ పోస్టులకు: ఎస్సీ / ఎస్టీ: ₹300 చెల్లించాలి
ఇతరులు: ₹600

శ్రామిక్ పోస్టులకు: ఎస్సీ / ఎస్టీ: ₹200 చెల్లించాలి
ఇతరులు: ₹400

అభ్యర్థులు ఆన్లైన్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ
విద్యార్హత ఆధారంగా మెరిట్ లిస్ట్

డ్రైవర్ పోస్టులకు: డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఇలా దరఖాస్తు చేసుకోండి
-  అధికారిక వెబ్‌సైట్ www.tgsrtc.telangana.gov.in  ను సందర్శించాలి
-  Recruitment 2025 సెక్షన్ లోకి వెళ్లి, కావలసిన పోస్టును ఎంచుకోవాలి
-  తరువాత Apply Online పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి.
-  పోస్టుకు కావాల్సిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
-  అప్లికేషన్ ఫీజు చెల్లించి Submit మీద క్లిక్ చేయండి.
-  చివరగా, అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget