అన్వేషించండి

Amaravati News: అమరావతిలో CRDA ఆఫీస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, బిల్డింగ్ ప్రత్యేకతలివే

AP Capital Amaravati | అమరావతిలో తొలి శాశ్వత నిర్మాణం అయిన సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు.

CRDA Office In Amaravati | అమ‌రావ‌తి: రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు మొట్టమొదటి పాల‌నా భ‌వ‌నం మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 9.54 గంటలకు మున్సిపల్ శాఖలో ఒక విభాగం అయిన CRDA ఆఫీస్ ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండటంతో బహిరంగ సమావేశం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గ్రాఫిక్స్ డిజైన్లను నేడు కార్యరూపంలోకి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం.

రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌తిబింబించేలా బిల్డింగ్ బయట A అక్ష‌రంతో ఎలివేష‌న్ ఇచ్చారు. ఇదే ఈ బిల్డింగ్ కి ప్రధాన ఆకర్షణ. అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌ను ఇకనుంచి ఇక్క‌డి నుంచే ప‌ర్య‌వేక్షిస్తారు. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో ఏపీ మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఇక్క‌డ ఒక ప్ర‌ధాన భ‌వ‌నంతో పాటు PEB భ‌వ‌నాలు నిర్మించారు. 

4.32 ఎకరాల్లో నిర్మాణాలు..

4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7((G+7) భవనం 3 లక్షల 7వేల 326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్ర‌ధాన భ‌వ‌నం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.36 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. ఇవి కాకుండా హెడ్ రూమ్స్ 5,554,చ.అ, ప్రొజెక్షన్ శ్లాబ్స్  3,113చ.అ.,టెర్రస్ PEB స్ట్రక్చర్ 32,062 చ.అడుగులు కలిపి మొత్తం 2,85,561 చ.అడుగుల విస్తీర్ణంలో(బిల్ట‌ప్ ఏరియా)లో  ఈ బిల్డింగ్ నిర్మించారు .

జీ ప్లస్ 7(G+7) లో శాఖ‌ల‌వారీగా కేటాయింపుల వివరాలిలా ఉన్నాయి. 

గ్రౌండ్ ఫ్లోర్ - 23,814 చ.అ-రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, రెస్టారెంట్, బ్యాంక్, ఏఐ కమాండ్ సెంటర్ 

ఫస్ట్ ఫ్లోర్ - కాన్ఫరెన్స్ హాల్స్ - 30,886 చ.అ

సెకండ్ ఫ్లోర్ - సీఆర్డీఏ(CRDA) - 30,886 చ.అ

థర్డ్ ఫ్లోర్- సీఆర్డీఏ - 32,096చ.అ. 

ఫోర్త్ ఫ్లోర్ -మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీస్ - 30,862చ.అ.

ఐదో ఫ్లోర్ - సీఆర్డీఏ(ADCL) - 32,096చ.అ.

ఆరో ఫ్లోర్ -ఏడీసీఎల్  - 32,096చ.అ.

ఏడో ఫ్లోర్ - 32,096 చ.అ. - పుర‌పాల‌క శాఖ మంత్రి  చాంబ‌ర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబ‌ర్, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ, ఏడీసీఎల్

టెర్రస్ PEB - డైనింగ్

ఆఫీస్ ప్రాంగణంలో సంపు, పంప్ రూం 4,029చ.అడుగులు, 5014 చ.అ., డ్రైవర్స్ లాంజ్ 752 సెక్యూరిటీ రూం 225, యుటిలిటీ బ్లాక్ 11,745 చ దరపు అడుగులతో కలిపి మొత్తం ఎక్స్టర్నల్ బ్లాక్ 21,765 చ.అడుగులు ఉన్నాయి. ఇంటర్నల్ బ్లాక్, ఎక్స్ టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం 3,07,326 చదరపు అడుగుల్లో నిర్మాణం జరిగింది.

మొత్తం లిఫ్ట్ లు - 7 (ఒక్కొక్క‌టి 8 మంది కెపాసిటీ)
పార్కింగ్ వ‌స‌తి - 170 ఫోర్ వీల‌ర్, 170 టూ వీల‌ర్ వెహిక‌ల్స్. 

ఈ ప్ర‌ధాన కార్యాల‌యానికి ప‌క్క‌న మొత్తం 8 ఎక‌రాల్లో (పార్కింగ్ ఏరియాతో క‌లిపి) మ‌రో 4 భ‌వ‌నాలు నిర్మించారు.

భవనం 1 - 41,500,చ.అ - టిడ్కో, APUFIDC, భవనం 2 - 41,500,చదరపు అడుగులు - స్వచ్చాంధ్ర కార్పొరేషన్,రెరా అప్పిలేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్..  భవనం 3 - 41,500,చదరపు అడుగులు - రెరా, టౌన్ ప్లానింగ్(DTCP), భవనం 4 - 41,500,చదరపు అడుగుల్లో మెప్మా కార్యాల‌యం నిర్మించారు.


Amaravati News: అమరావతిలో CRDA ఆఫీస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, బిల్డింగ్ ప్రత్యేకతలివే

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత నిర్మాణాలలో తొలి కార్యాలయం ప్రారంభోత్సవం ఏర్పాట్లను మంత్రి నారాయణ ఆదివారం పరిశీలించారు. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరుగుతుందన్నారు. సీఎం చంద్రబబు పర్యటన ఏర్పాట్ల పై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. ఏపీ ప్రభుత్వం రాయపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు ను అనుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మించింది. G+7 భవనం తో పాటు మరో నాలుగు PEB భవనాలు నిర్మించింది. సీఆర్డీయే, ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలు చేసింది. 


Amaravati News: అమరావతిలో CRDA ఆఫీస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, బిల్డింగ్ ప్రత్యేకతలివే

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
Advertisement

వీడియోలు

Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
BJP Politics: కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు తీరని అన్యాయం చేశాయి: బండి సంజయ్
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు అన్యాయం: బండి సంజయ్
Actress Raasi: అనసూయ వివాదంలో మరో ట్విస్ట్.. హీరోయిన్ రాశి ఫైర్, పేరెత్తకుండానే చీవాట్లు !
అనసూయ వివాదంలో మరో ట్విస్ట్.. హీరోయిన్ రాశి ఫైర్, పేరెత్తకుండానే చీవాట్లు !
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
2025లో చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ - హోల్‌సేల్‌, రిటైల్‌ సేల్స్‌లో కొత్త రికార్డులు
డిసెంబర్‌లో బ్లాక్‌బస్టర్‌, 2025లో సేల్స్‌ సునామీ - రికార్డులు తిరగరాసిన మారుతి సుజుకీ
Embed widget