Vinutha Kota: వీలైతే కోట వినుత హత్య! ప్రైవేట్ వీడియోలు పంపితే రూ.60 లక్షలు.. షాకింగ్ నిజాలు
వినుత కోట దంపతులను హత్య చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు తనకు చెప్పారని.. లేకపోతే ప్రైవేట్ వీడియోలు పంపితే రూ.60 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో బటయకు వచ్చింది.

Srikalahasti Politics | తిరుపతి: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా ఉన్న కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు అరెస్ట్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో దంపతులు కొన్ని నెలల కిందట అరెస్ట్ కావడం తెలిసిందే. అయితే వీరిని హత్య చేయాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు తనకు చెప్పారని, అదీ కుదరకపోతే కనీసం కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీసి పంపాలని బెదిరించినట్లు కొంతకాల కిందట హత్యకు గురైన డ్రైవర్ రాయుడు మాట్లాడిన సెల్ఫీ వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. కోట వినుత ప్రైవేట్ వీడియోలు పంపింతే రూ.60 లక్షల వరకు ఇస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి ఆఫర్ చేసినట్లు డ్రైవర్ తెలిపాడు. 19 నిమిషాల 42 సెకన్ల వీడియో శ్రీకాళహస్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
ఈ ఏడాది జూలై 7న శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు కలిసి డ్రైవర్ రాయుడిని హత్యచేశారు. మరుసటి రోజు చెన్నైలోని కూవం నదిలో శవాన్ని పడేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కోట వినుత, చంద్రబాబును అరెస్ట్ చేశారు. అనంతరం జనసేన పార్టీ కోట వినుతను సస్పెండ్ చేసింది. దాదాపు మూడు నెలల తరువాత డ్రైవర్ రాయుడు బతికుండగా తీసిన సెల్ఫీ వీడియో తాజాగా బయటకు వచ్చింది.

వీడియోలో రాయుడు తెలిపిన వివరాలు..
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి జనసేన ఇంఛార్జ్ కోట వినుత, ఆమె భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారు. బొజ్జల తన అనుచరుడు సుజిత్‌రెడ్డితో తనను సంప్రదించి కోట వినుత, ఆమె భర్తను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాలని సూచించినట్లు రాయుడు ఆరోపించాడు. వారి హత్యకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపాడు. 2024 ఎన్నికలకన్నా ముందే జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయిప్రసాద్ టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించారని వీడియోలో వెల్లడించాడు.
తాను 2019 నుండి కోట వినుతకు డ్రైవర్‌గా పని చేస్తున్నానని, పదవి వస్తే ఇల్లు, కారు కొనిస్తానని వినుత హామీ ఇచ్చారని రాయుడు తెలిపాడు. 2023 నవంబరులో సుజిత్‌రెడ్డి తనను కలిసి, కోట వినుత గురించి అన్ని విషయాలు సుజిత్‌కు చెప్పిస్తే రూ.30 లక్షలు ఇస్తామన్నాడు. మొదట 2 లక్షలు ఇచ్చారు. ఇబ్బందిగా ఉందని చెబితే రూ.20 లక్షలు ఇచ్చారు. ఏప్రిల్‌లో కోకాకోలా పరిశ్రమ వద్ద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నన్ను కలిశారు. జీతం రూ.9వేలని చెప్పగా తాను రూ.19వేలు ఇస్తానని, తన దగ్గరకు రావాలని చెప్పారని రాయుడు తెలిపాడు. కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీసి ఇవ్వాలని అడిగారు. నీ పేరు బయటకు రాకుండా చూసుకుంటానని చెప్పినట్లు వీడియోలో రాయుడు తెలిపాడు.
‘సుజిత్ రెడ్డి నన్ను కలిసి అడగగా.. ప్రైవేట్ వీడియోలు తీయలేనని చెప్పాను. ఎమ్మెల్యే అంటే భయం లేదా అని అంటూ బెదిరించాడు. రూ.30 లక్షలు కాకపోతే రూ.60 లక్షలు ఇస్తా అన్నాడు. కొట్టే సాయిప్రసాద్ ఫోన్ చేసి, కోట వినుత దంపతులను ఊరి నుంచి తరిమేయాలన్నాడు. వీడియోలు తీయకపోతే నువ్వు మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ ను కోట వినుతకు ఇస్తానని బెదిరించారు. ఏప్రిల్ 26న వినుత సోఫాలో ఉన్నప్పుడు వీడియో తీసే ప్రయత్నంలో శబ్దం రావడంతో నా సెల్‌ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారు. నన్ను ఇంట్లో బంధించగా తప్పించుకునే క్రమంలో కాలు విరిగింది” అని రాయుడు పేర్కొన్నాడు.
ఇటీవల కొట్టే సాయిప్రసాద్ శ్రీకాళహస్తి దేవస్థానం ఛైర్మన్ అయ్యారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గత నెల 19న కోట వినుత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తికి పదవి సరికాదని, నాపై జరిగిన రాజకీయ కుట్రలో ప్రధాన మైన వ్యక్తుల్లో ఈ కొట్టే సాయి ప్రసాద్ ఒకరని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. అతడు సొంతంగా వీడియో రికార్డ్ చేశాడా, లేక భయపెట్టి వీడియో తీయించారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.






















