SIT on Adulterated liquor case: నకిలీ మద్యం కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు.. కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రత్యేక యాప్
AP CM Chandrababu | నకిలీ మద్యం కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Adulterated liquor case: అమరావతి: కల్తీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సెట్ ఏర్పాటు చేయగా, సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ శర్మ, మల్లికా గార్గ్, ఎక్సైజ్ నుంచి మరొకరు ఉన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో కల్తీ మద్యం తయారీ ఇటీవల బయటపడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలు దాసరిపల్లి జయచంద్రా రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
4 పీటీ వారెంట్‌లు నమోదు
చంద్రబాబు మాట్లాడుతూ.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. వీరిలో 16 మందిని అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్‌లు నమోదు చేశారు. ఈ కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. అరెస్టులతో నిజాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదులుతోంది. దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నాం. అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఎక్సైజ్ శాఖలో మరొకరితో సిట్ వేస్తున్నాం’ అన్నారు.
సీఎం చంద్రబాబు..
నాకు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. ములకల చెరువు ఘటన బయట పెట్టిందే మేము. అరెస్టులు చేసింది మేము..వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది కూడా మేము. సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయి...ఎవరూ తప్పించుకోలేరు. నకిలీ మద్యం తయారు చేయడం ఆఫ్రికాలో నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకుని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. దీని వెనక ఎవ్వరున్నా చర్యలు తీసుకుంటాం... రాజీపడే ప్రసక్తే లేదు. మా పార్టీ వాళ్లపై ఆరోపణలు ఉన్నా సస్పెండ్ చేశాం.
ఇక నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వినియోగించుకుంటున్నాం. అందుకే యాప్ తెచ్చాం. బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి. దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నాం. అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఎక్సైజ్ శాఖలో మరొకరితో సిట్ వేస్తున్నాం. నాకు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. ములకల చెరువు ఘటన బయట పెట్టిందే మేము. అరెస్టులు చేసింది మేము..వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది కూడా మేము.
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్
సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు. నకిలీ మద్యం తయారు చేయడం ఆఫ్రికాలో నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకుని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. దీని వెనక ఎవ్వరున్నా చర్యలు తీసుకుంటాం...రాజీపడే ప్రసక్తే లేదు. మా పార్టీ వాళ్లపై ఆరోపణలు ఉన్నా.. సస్పెండ్ చేశాం. ఇక నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వినియోగించుకుంటున్నాం. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ యాప్ తెచ్చాం. బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయని’ చంద్రబాబు పేర్కొన్నారు.






















