Abhishek Sharma లగ్జరీ లైఫ్ - కోట్ల విలువైన Ferrari Purosangue కొనుగోలు, రేటు తెలిస్తే మీ కళ్లు తిరుగుతాయ్!
భారత క్రికెటర్ అభిషేక్ శర్మ ఇటీవల ఫెరారీ పురోశాంగ్‌ను కొనుగోలు చేశాడు. అతని కొత్త కారు ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ లగ్జరీ SUVలో V12 ఇంజిన్ & అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Abhishek Sharma Luxury Car Collection - New Ferrari Purosangue: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ, తన లగ్జరీ కార్ల కలెక్షన్‌కు మరో అద్భుతమైన వాహనాన్ని యాడ్ చేశాడు. అతను, ఇటీవల, ఫెరారీ పురోశాంగ్‌ను కొనుగోలు చేశాడు, దీనిని ఫెరారీ మొదటి SUVగా పరిగణిస్తారు. ఈ కారు ధర మన దేశంలో దాదాపు ₹10.5 కోట్లు ఉంటుందని సమాచారం. అభిషేక్ శర్మ, తన కొత్త కారు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో.. అతను డెనిమ్ జాకెట్ & సన్ గ్లాసెస్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఫెరారీ పురోశాంగ్ స్లీక్ బ్లాక్ కలర్ ఎక్స్‌టీరియర్ & రెడ్ కలర్ ఇంటీరియర్ భాగాలు కూడా ఈ ఫోటోలలో అద్భుతంగా కనిపించాయి. దీంతో, కొత్త కారు కొన్న అభిషేక్ శర్మకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అభిషేక్ శర్మ కార్ల కలెక్షన్ గురించి కూడా అభిమానులు ఇప్పుడు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు.
Ferrari Purosangue ఇంజిన్ & పవర్
ఫెరారీ పురోశాంగ్ V12 నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 725 హార్స్‌పవర్ & 716 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) & రియర్-వీల్ డ్రైవ్ (RWD)లను కలిగి ఉంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, ఒక రేసింగ్ కారు తరహాలో దూసుకెళ్తుంది.
ఫెరారీ పురోశాంగ్‌కు సూసైడ్ డోర్లు (Suicide doors) లేదా కోచ్ డోర్లు (Coach doors) ఉన్నాయి, ఇవి వెనుకకు తెరుచుకుంటాయి, ఇది ఈ కారుకు క్లాసిక్ + మోడ్రన్ టచ్ ఇస్తుంది. ఈ కారు ఫెరారీ కొత్త TASV (ట్రూ యాక్టివ్ స్పూల్ వాల్వ్) సస్పెన్షన్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇది రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా డంపర్‌లను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీని అర్థం.. రోడ్డు కఠినంగా ఉన్నా లేదా నునుపుగా ఉన్నా డ్రైవ్ ఎప్పుడూ సౌకర్యవంతంగా & స్మూత్‌గా సాగుతుంది. ఫెరారీలో ఏరోబ్రిడ్జ్ & సస్పెండెడ్ రియర్ స్పాయిలర్ కూడా ఉన్నాయి, ఇవి గాలి పీడనాన్ని బ్యాలెన్స్ చేస్తాయి & డ్రాగ్‌ను తగ్గిస్తాయి. ఇది, వేగంలోనూ కారు పనితీరును & స్థిరత్వాన్ని రెండింటినీ పెంచుతుంది.
ఫెరారీ పురోశాంగ్ విలాసవంతమైన ఇంటీరియర్
ఈ ఫెరారీ కారు లోపలి భాగం ఫైవ్ స్టార్ హోటల్ లాంజ్ లాగా అనిపిస్తుంది. దీనికి ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్‌ను కలిగి ఉంది, ఇది లోపలి భాగాన్ని విశాలంగా & ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. ముందు సీట్లలో మసాజ్ ఫంక్షన్లు, వెంటిలేషన్ & 10 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి, ఇవి సౌకర్యం & భద్రత రెండింటినీ అందిస్తాయి. మొదటిసారిగా, ఫెరారీ, ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేను చేర్చింది, ఇది కనెక్టివిటీని సులభంగా మార్చింది. ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజ్ డోర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ & వెనుక ప్రయాణీకుల కోసం USB-C పోర్ట్‌లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఈ ఫెరారీ వేగాన్ని ఇవ్వడమే కాకుండా పూర్తి లగ్జరీ అనుభవాన్ని కూడా అందించేలా ప్రతి డిటైల్‌ను జాగ్రత్తగా రూపొందించారు.





















