అన్వేషించండి

Maruti మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ SUV e Vitara లాంచ్‌కు రెడీ అయింది - సింగిల్‌ ఛార్జ్‌తో 500km పైగా రేంజ్‌

Maruti e Vitara Launch Features: మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ప్రీమియంగా తయారు చేయడానికి LED హెడ్‌లైట్లు, DRLs, మరెన్నో మోడ్రన్‌ ఫీచర్లు అందిస్తోంది.

Maruti e Vitara Launch Date Price Features: మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు, ఈ-విటారా కోసం దేశవ్యాప్తంగా కారు ప్రేమికులు, అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు దగ్గరలోకి వచ్చింది. ఇప్పుడు, మారుతి ఈ-విటారా లాంచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కారు SUV విభాగంలోకి వస్తుంది & కంపెనీ దీనిని "ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025"లో ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ SUV ఈ సంవత్సరం చివరిలో, అంటే డిసెంబర్ 2025 లో షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారును గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.        

మారుతి ఇ-విటారా మోడ్రన్‌ ఫీచర్లు
మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ప్రీమియం కారుగా తీర్చిదిద్దడానికి ఈ కంపెనీ చాలా మోడ్రన్‌ ఫీచర్లను అందిస్తోంది. హెడ్‌లైట్లు, DRLs & టెయిల్‌ల్యాంప్‌లు అన్నీ ఫుల్‌ LED ప్యాక్‌లో రావచ్చు. ఈ SUVలో 18-అంగుళాల చక్రాలు & యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్ కూడా ఉంటాయి, ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని, అదే సమయంలోనే మైలేజ్‌ను మెరుగు పరుస్తుంది. ఇంకా... పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లు ఉంటాయి. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.    

మారుతి ఇ-విటారా బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు
ఈ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది, అవి: 48.8 kWh బ్యాటరీ ప్యాక్ & 61.1 kWh బ్యాటరీ ప్యాక్. బిగ్‌ బ్యాటరీ ప్యాక్‌ (61.1 kWh) తో ఈ కారు 500 కి.మీ. పైగా డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుందని కంెపనీ క్లెయిమ్ చేస్తోంది. అయితే, వాస్తవ పరిధి అనేది డ్రైవింగ్ శైలి & ట్రాఫిక్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.     

మారుతి ఇ-విటారా భద్రతలు
మారుతి ఇ-విటారా చాలా సేఫ్టీ ఫీచర్లతో ‍‌(Maruti e Vitara Safety Features) వస్తుందని భావిస్తున్నారు. లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రత సాంకేతికతలను చేర్చవచ్చు. SUV డ్రైవర్ & ప్రయాణీకుల భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉండవచ్చు. ఇ-విటారాలోని ఇతర భద్రతా లక్షణాలలో బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా & ముందు - వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.  

మారుతి ఇ-విటారా ధర
మారుతి సుజుకి ఇ-విటారా ధర ₹17-18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని (Maruti e Vitara Price) అంచనా. టాప్-స్పెక్ వేరియంట్ ధర ₹25 లక్షల వరకు ఉండవచ్చు.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Advertisement

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Krithi Shetty : ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు
ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... నెగిటివ్ కామెంట్స్‌పై 'బేబమ్మ' కన్నీళ్లు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
EV స్కూటర్ బ్యాటరీ చాలా ఏళ్లు ఉండేందుకు టిప్స్, లేకపోతే మీ జేబుకు చిల్లు
EV స్కూటర్ బ్యాటరీ చాలా ఏళ్లు ఉండేందుకు టిప్స్, లేకపోతే మీ జేబుకు చిల్లు
Embed widget