భారతదేశంలోనే అత్యంత రహస్యమైన కుల్ధారా సిటీ మిస్టరీ
ఇళ్లు అలాగే ఉన్నాయి. ఇంట్లో వస్తువులు అలాగే ఉన్నాయి. పండిన పండటు.. వండిన వంటలు, నీటి బిందెలు.. అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఒక్క రోజు క్రితం వరకు జనాలతో హడావుడిగా ఉన్న ఆ ఊరు.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిపోయింది. మనిషి కాదు కదా.. కనీసం పురుగు కూడా అలికిడి లేని నిర్మాణుష్య గ్రామంగా, ఘోస్ట్ సిటీగా మారిపోయింది. ఇప్పటివరకు ఎంతోమంది సైంటిస్టులకి కూడా రాత్రికి రాత్రి ఆ ఊరి జనం ఏమైపోయారు? ఎక్కడికిపోయారు? ఎలా మాయం అయ్యారు? అనేది అర్థం కాని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ ఊరి పేరు చెబితే.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతారు. అదో శాపగ్రస్తమైన ఊరని, అక్కడికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న భూతాలు చంపేసి శవాలని కూడా మాయం చేస్తాయని బలంగా నమ్ముతారు. కానీ నిజంగా ఆ ప్రాంతంలో అలాంటి భూతాలు, దెయ్యాలు ఉన్నాయా..? వందల ఏళ్ల క్రితం ఆ ఊరి జనాలని కూడా ఆ భూతాలే మాయం చేశాయా..? అసలు ఆ ఊరి మిస్టరీ ఏంటి? పదండి ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో తెలుసుకుందాం.





















