News
News
వీడియోలు ఆటలు
X

ISRO: బీటెక్ అర్హతతో 'ఇస్రో'లో ఉద్యోగాలు, 303 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్‌సీ’'(గ్రూప్-ఎ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్‌సీ’'(గ్రూప్-ఎ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 303 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25న ప్రారంభమైంది. జూన్ 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

* సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 303.

➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (ఎలక్ట్రానిక్స్): 90 పోస్టులు

➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (మెకానికల్): 163 పోస్టులు

➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (కంప్యూటర్ సైన్స్): 47 పోస్టులు

➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌: 02 పోస్టులు

➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (కంప్యూటర్ సైన్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌: 01 పోస్టు

అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 14.06.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.

పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూఢిల్లీ, తిరువనంతపురం.

ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.05.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 14.06.2023.

Notification

Online Application

Website

Also Read:

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

సశస్త్ర సీమాబల్‌లో 543 కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 543 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

తపాలా శాఖలో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. దీంతో పాటు మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మే 22 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 25 May 2023 08:27 PM (IST) Tags: ISRO Jobs Indian Space Research Organisation ISRO Notification ISRO Recruitment ISRO Scientist/Engineer Posts

సంబంధిత కథనాలు

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?