Fertilizer shortage in Telangana: తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
Telangana fertilizer problems: తెలంగాణలో ఎరువుల సమస్య తీవ్రం కావడంతో రైతులు సహనం కోల్పోతున్నారు. యూరియా అందుబాటులో ఉండటంపై రైతులకు ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Telangana farmers anger: తెలంగాణలో రైతులు యూరియా కోసం ఆందోళనలు చేస్తున్నారు. 2025 ఖరీఫ్ సీజన్‌లో యూరియా ఎరువుల కొరత తీవ్రంగా మారింది. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ జిల్లాల్లో ప్రదర్శనలు చేపడుతున్నారు.
వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కొరతపై ఆందోళనలు చేపట్టారు. సిద్దిపేట్‌లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. వరంగల్‌లో రైతులు జాతీయ రహదారిని బ్లాక్ చేసి, వంట వార్పూ నిర్వహించారు. నాగర్‌కర్నూల్, కరీంనగర్, హుజురాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా రైతులు రోడ్లపై పడుకుని, క్యూలలో చెప్పులు పెట్టి స్థానాలు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలీసులు కొన్ని చోట్ల రైతులను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.
రైతులకు యూరియా బస్తా ఇవ్వని ముఖ్యమంత్రి మహిళలను కోటిశ్వరులను చేస్తాడంట..!
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) September 5, 2025
కోటిశ్వరులను చేసుడు ఏమో గాని యూరియా కోసం లైన్ లో నిల్చున్న తెలంగాణ ఆడబిడ్డలు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి తెచ్చింది నీ దుర్మార్గపు పాలన రేవంత్ రెడ్డి..! pic.twitter.com/ha2bGy9Lqa
మహబూబాబాద్‌లో గ్రోమోర్ సెంటర్ పై రైతులు దాడి చేశారు. క్యూలైన్లలో రైతుల మధ్య కూడా తోపులాటలు జరిగి దాడి చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా?
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 5, 2025
ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గమిది
యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని పోలీసులు ఇంటికి వెళ్లి… pic.twitter.com/qo6wverfqc
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియా కొరత లేదని, కేవలం పంపిణీ సమస్యలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఈ పంపిణీ సమస్యలను నియంత్రించడంలో కూడాప్రభుత్వం విఫలమవుతోది. రైతులకు సరైన సమాచారం అందకపోవడంతో వారంతా యూరియా కోసం పోలోమంటూ తరలి వస్తున్నారు. అయితే యూరియా బ్లాక్ మార్కెట్ లో విరివిగా లభిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.400కు బ్లాక్ మార్కెట్ లో లభిస్తోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు.
🚨 కోదాడ – కొమరబండ సొసైటీ
— Mallaiah Yadav Bollam (@BollamMallaiah) September 5, 2025
✳️సాగుభూమి: 600 ఎకరాలు
✳️ యూరియా సంచులు: 200
👉మంత్రిగా ఉత్తమ్
👉స్థానిక MLA వైఫల్యం ఇది
మంత్రిగా యూరియా బస్తాలు కూడా ఇవ్వడం చేతకానోడివి
మళ్ళీ అభివృద్ధి అంటూ
కాళ్ళు గాలిన పిల్లిలా
హెలికాప్టర్ లో తిరగడం
సిగ్గుండాలి పండుగల పూట
రైతులను ఏడిపించడానికి! pic.twitter.com/HFhIcDA3bJ
విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున యూరియా సమస్యలపై విమర్శలు చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉందని.. మెల్లగా అందరికీ అందుతోందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.





















